National

FSSAI: ఫ్రీడమ్ ఆయిల్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

FSSAI: ఈ వంటనూనె వాడితే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, గుండె చాలా పదిలంగా ఉంటుంది అంటూ టీవీల్లో, ఆన్‌లైన్‌లో వచ్చే యాడ్స్ చూసి కొంటున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్. ఇలాంటి మాటలు చెప్పి జనాలను మోసం చేస్తున్నారంటూ ప్రముఖ వంటనూనె కంపెనీ ‘ఫ్రీడమ్ కుకింగ్ రైస్ బ్రాన్ ఆయిల్’పై భారత ఆహార భద్రతా సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సీరియస్ అయింది.

FSSAI: ఈ వంటనూనె వాడితే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, గుండె చాలా పదిలంగా ఉంటుంది అంటూ టీవీల్లో, ఆన్‌లైన్‌లో వచ్చే యాడ్స్ చూసి కొంటున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్. ఇలాంటి మాటలు చెప్పి జనాలను మోసం చేస్తున్నారంటూ ప్రముఖ వంటనూనె కంపెనీ ‘ఫ్రీడమ్ కుకింగ్ రైస్ బ్రాన్ ఆయిల్’పై భారత ఆహార భద్రతా సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సీరియస్ అయింది. రూల్స్ పాటించకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆ కంపెనీకి, ఆ నూనెను ఆన్‌లైన్‌లో అమ్ముతున్న సంస్థలకు గట్టి షాక్ ఇచ్చింది.

మూడు కంపెనీలకు నోటీసులు

నిబంధనలు గాలికొదిలేసి యాడ్స్ ఇస్తున్న జెమిని ఎడిబుల్స్ కంపెనీతో పాటు, వాటిని ప్రమోట్ చేస్తూ అమ్ముతున్న బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌లకు కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ షోకాజ్ నోటీసులు పంపింది. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని నిలదీసింది. ఈ నూనె వాడితే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని, ఇందులో 10,000 పీపీఎం కంటే ఎక్కువ ఓరిజనాల్ ఉంటుందని తెగ ప్రచారం చేశారు. కానీ రూల్స్ ప్రకారం.. రైస్ బ్రాన్ ఆయిల్‌కి ఇలా గుండె ఆరోగ్యం బాగుపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని ప్రచారం చేసుకునే పర్మిషన్ లేదని అధికారులు తేల్చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి మాటలు చెప్పి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని తప్పుబట్టారు.

పర్మిషన్ లేకుండానే ఆన్‌లైన్ అమ్మకాలు

ఇందులో మరో షాకింగ్ విషయం కూడా బయటపడింది. జెమిని ఎడిబుల్స్ సంస్థ తన సొంత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నూనె అమ్ముతున్నప్పటికీ, దానికి కావాల్సిన సరైన సెంట్రల్ లైసెన్స్ కూడా కంపెనీ దగ్గర లేదని తేలింది. మార్కెట్లో అందరూ వాడే ఫ్రీడమ్ ఆయిల్‌పై ఇలాంటి నోటీసులు రావడం ఇప్పుడు సామాన్యుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

#FSSAI#Freedom Cooking Oil#Freedom Rice Bran Oil#Gemini Edibles#Flipkart#BigBasket#Food Safety#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి