National

Abhijit Deepke: అలా చేస్తే నన్ను ఉరితీయండి : అభిజీత్‌ దీప్కే

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

Abhijit Deepke: "నేను అల్లర్లు చేసేలా మాట్లాడినట్లు ఒక్క వీడియో కానీ, ఒక్క ఆధారం కానీ చూపించండి.. నన్ను ఉరితీసినా పర్లేదు" అంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చీఫ్ అభిజిత్ దీప్కే ఢిల్లీ పోలీసులకు గట్టి సవాల్ విసిరారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ తీరుకు వ్యతిరేకంగా, తమ పార్టీ నేతల అరెస్టులను ఖండిస్తూ సీజేపీ చేపట్టిన 'తిరంగా యాత్ర' ఇప్పుడు ఢిల్లీలో తీవ్ర రచ్చకు దారితీసింది.

Abhijit Deepke: "నేను అల్లర్లు చేసేలా మాట్లాడినట్లు ఒక్క వీడియో కానీ, ఒక్క ఆధారం కానీ చూపించండి.. నన్ను ఉరితీసినా పర్లేదు" అంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చీఫ్ అభిజిత్ దీప్కే ఢిల్లీ పోలీసులకు గట్టి సవాల్ విసిరారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ తీరుకు వ్యతిరేకంగా, తమ పార్టీ నేతల అరెస్టులను ఖండిస్తూ సీజేపీ చేపట్టిన 'తిరంగా యాత్ర' ఇప్పుడు ఢిల్లీలో తీవ్ర రచ్చకు దారితీసింది. ఈ యాత్రను ఆపాలంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో వ్యవహారం మరింత వేడెక్కింది.

ఇంటికి వచ్చిన పోలీసులపై ఫైర్

అల్లర్లు సృష్టిస్తున్నారంటూ సుమారు 15 నుంచి 20 మంది పోలీసులు ఢిల్లీలోని అభిజిత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు చేతిలో పెట్టారు. దీంతో ఆయన ఒక్కసారిగా భగ్గుమన్నారు. "సోషల్ మీడియాలో నేను ఎక్కడైనా అల్లర్లు రేపేలా మాట్లాడినట్లు ఒక్క ఆధారం ఉందా? తెల్ల కాగితం మీద మీకు తోచింది రాసుకొచ్చి నా చేతిలో పెడితే సరిపోతుందా? తప్పు చేసినట్లు నిజంగా ప్రూఫ్ ఉంటే నన్ను డైరెక్ట్‌గా ఉరితీయండి" అంటూ పోలీసుల ముందే ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే..

ఓటర్ల లిస్టులో గోల్‌మాల్ జరిగిందంటూ సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా సెంట్రల్ పార్క్ దగ్గర జెండా ఎగరేయాలని సీజేపీ ప్లాన్ చేసింది. అయితే అంతకుముందే జంతర్ మంతర్ దగ్గర జాతీయ జెండాతో నిరసనకు దిగిన తమ పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్‌లను పోలీసులు అరెస్ట్ చేయడంతో, దాన్ని వ్యతిరేకిస్తూ ఈ తిరంగా యాత్రకు పిలుపునిచ్చారు.

పోలీసుల ఆంక్షలు.. పార్క్ మూసివేత

మరోవైపు కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో సెక్షన్ 163 అమల్లో ఉందని, పర్మిషన్ లేకుండా గుంపులుగా చేరితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. అటు అధికారులు సెంట్రల్ పార్క్‌ను రెండు రోజుల పాటు మూసేశారు. నిరసనలతో ట్రాఫిక్ జామ్ అయి తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వ్యాపారులు కూడా చెబుతున్నారు. అయితే పోలీసుల తీరుపై దీప్కే వేసిన "నన్ను ఉరితీయండి" అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

#Abhijit Deepke#Cockroach Janata Party#CJP#Delhi Police#Tiranga Yatra#Gyanesh Kumar#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి