Ramya Krishnan: ఒక నటుడికి, లేదా నటికి ఓ గొప్ప పాత్ర రావడం ఎంత అదృష్టమో ఆ పాత్ర తర్వాత వచ్చిన క్రేజ్ నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం అవుతుంది. కొందరికి అదే దురదృష్టంగా మారుతుంది. సీనియర్ నటి రమ్య కృష్ణ పరిస్థితి కూడా ఇలాగే ఉందంటున్నారు ఇండస్ట్రీలోని ప్రముఖులు. కెరీర్లో బాహుబలి సినిమా రమ్య కృష్ణకి ఎంతో ప్రత్యేకం. శివగామి పాత్రలో ఒకరకంగా విశ్వరూపం చూపించింది. కానీ, ఇప్పుడు ఆపాత్రే శాపంగా మారిందా?
కెరీర్ ప్రారంభంలో రమ్యకృష్ణకి ఐరెన్ లెగ్ అనే పేరుండేది. మొదట్లో చేఇసిన సినిమాలన్నీ ఫ్లాపవుతూ వచ్చాయి. ఇక, రమ్యకృష్ణను తీసుకుంటే సినిమా ఫ్లాప్ అన్న నిర్ణయానికి వచ్చారు మేకర్స్. డైలమాలో పడింది ఆమె కెరీర్. సరిగ్గా అలాంటి సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రమ్యకృష్ణకి వరుసగా అవకాశాలివ్వడమే కాదు, బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ఎవరైతే రమ్యను తీసుకుంటే సినిమా ఫ్లాప్ అన్నారో వాళ్ళే లక్కీ హీరోయిన్ అని అడ్వాన్స్ ఇవ్వడానికి క్యూ కట్టారు.
అలా, రాఘవేంద్రరావు మంచి ఆఫర్స్ ఇచ్చి రమ్యకృష్ణ ఫేట్ మార్చేశారు. అదే, సమయంలో చేసిన ఛాలెంజింగ్ రోల్ నరసింహ(తమిళంలో పడియప్పా) లోని నీలాంబరి పాత్ర. సూపర్ స్టార్ రనిజీకాంత్కి పోటీనిచ్చే పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టింది. కేవలం, ఆమె కోసమే సినిమా చూసిన వాళ్ళు కోకొల్లల్లు. అలాంటి, పాత్ర రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. మళ్ళీ ఎన్నో ఏళ్ళకి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్లో పోషించిన శివగామి పాత్ర.
స్క్రీన్ మీద రమ్యకృష్ణ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇంకొకరిని ఊహించుకోవడం అసాధ్యం. ఇప్పుడు, రమ్యకృష్ణ కి అవకాశాలు వస్తున్నా కూడా ఆ స్థాయి పాత్రను ఆశిస్తారు. నార్మల్ కమర్షియల్ సినిమాలో వచ్చే తల్లి పాత్రలు చెయ్యడానికి ఇటు రమ్యకృష్ణకి, చూడడానికి అటు ప్రేక్షకులకి ఆనడం లేదు. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకి తల్లిగా నటించింది. జైలర్ సినిమాలలో రజినీకాంత్ భార్యగా నటించింది. కానీ, అవి శివగామి పాత్రల్లో పావు వంతు కూడా ఎఫెక్టివ్గా లేవు. ఈ విషయంలో రమ్యకృష్ణకి డిసప్పాయింట్మెంటే.


