తెలంగాణ

Gadwal: శ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ.. తెలంగాణ సుభిక్షం కోసం మంత్రి మొక్కులు!..

రచన: Venu•••4 నిమిషాల పఠనం

శుక్రవారం ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం విఘ్నేశ్వర స్వామికి అభిషేకం చేసి, శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు.

దసరా శరన్నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకుని అలంపూర్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేసి ఆశీర్వచనాలు పలికారు.

శుక్రవారం ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం విఘ్నేశ్వర స్వామికి అభిషేకం చేసి, శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జోగులాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తనకు దక్కిన భాగ్యమని పేర్కొన్నారు.

పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మవారు మరింత శక్తిసామర్థ్యాలను ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్ర వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొనే ఇబ్బందులు తొలగిపోవాలని ఆకాంక్షించారు. తెలంగాణలో అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

అలాగే రైతులు మంచి దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, తెలంగాణ వ్యవసాయ రంగం సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రకృతి ప్రతికూల పరిస్థితుల నుంచి ప్రజలకు ఉపశమనం లభించాలని అమ్మవారి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారి, ప్రజల సంక్షేమం మరింతగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సరిత, ఆలయ ఈవో దీప్తి, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు..

#Jogulamba Temple#Vakiti Srihari#Telangana Government#Dasara Sharannavaratri#El Nino Impact#Telangana Farmers#Rainfall Prayers#Telangana Agriculture
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి