TG: కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు నెల నెలా రాజకీయ ఈఎంఐలు కట్టకపోతే తన ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కడ ఊడిపోతుందోనన్న భయంతోనే రేవంత్ రెడ్డి విదేశీ బొగ్గు కొనుగోళ్ల పేరుతో పెద్ద కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నర్సంపేటలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన, రేవంత్ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కమీషన్ల కక్కుర్తి కోసమే మన సింగరేణిని నిలువునా ముంచుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడు కనిపిస్తున్నది వాతావరణం వల్ల వచ్చిన కరువు కాదని, కేవలం కాంగ్రెస్ పాలన చేతగాక తెచ్చిన కృత్రిమ కరువు అని నిప్పులు చెరిగారు. బొగ్గు కొనుగోళ్లు, కరెంట్ వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, తక్షణమే ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేయించాలని డిమాండ్ చేశారు.


