సినిమా

Bollywood: మన హీరోయిన్స్‌కి బాలీవుడ్ కలిసిరావడం లేదే పాపం!

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Bollywood: తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్న మన హీరోయిన్స్‌కి బాలీవుడ్ మాత్రం అంతగా కలిసి రావడం లేదు. ఇక్కడ, వరుసగా బిగ్ స్టార్స్‌తో సినిమాలు చేసి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న వాళ్ళ చూపు హిందీ సీమపై పడుతోంది. మేనేజర్లు, నిర్మాతల ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ, ఆ ప్లాన్స్ అన్నీ అట్టర్ ఫ్లాపవుతున్నాయి. తెలుగులో కోట్లు సంపాదిస్తున్న మన హీరోయిన్స్‌కి హిందీలో మాత్రం ఒక్క హిట్ దక్కక తిరిగి హైదరాబాద్ ఫ్లైటెక్కుతున్నారు.

పూజా హెగ్డే:

తెలుగులో ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు సినిమాలతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడే ఉండకుండా హిందీలో హృతిక్ రోషన్ సరసన మోహంజాదారో సినిమాలో ఛాన్స్ వస్తే వెళ్ళింది. ఆ సినిమా డిజాస్టర్. దాంతో, మళ్ళీ అమ్మడి చూపు టాలీవుడ్ మీద పడింది. ఆ సమయంలో హరీష్ శంకర్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందిన డీజే లో ఛాన్స్ అందుకుంది. ఆ తర్వాత, తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలిగింది. మళ్ళీ, బాలీవుడ్ కి వెళ్ళింది. మళ్ళీ అదే జరిగింది.

కీర్తి సురేష్:

తెలుగు, తమిళం, మలయాళంలో కీర్తి వరుసగా ఆఫర్స్ అందుకుంటూ క్రేజీ హీరోయిన్‌గా వెలుగుతోంది. అయినా కూడా, బాలీవుడ్ మీద మోజుతో అక్కడ సినిమాలలో ట్రై చేసి అవకాశాలు అందుకుంది. 'బేబీ జాన్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాపైంది. ఇప్పుడు, 'అక్క' అనే వెబ్ సిరీస్‌తో రాబోతోంది. మరి, ఈ సిరీస్‌తోనైనా హిందీలో నిలబడుతుందా లేదా చూడాలి.

శ్రీలీల:

డాన్సింగ్ క్వీన్‌గా టాలీవుడ్‌లో పాపులర్ అయిన శ్రీలీల, తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా అవకాశాలను అందుకుంటోంది. కానీ, సక్సెస్‌లు మాత్రం దక్కడం లేదు. ఈ బ్యూటీకి వచ్చిన అవకాశాలకి హిట్స్ గనక పడి ఉంటే అసలు టాలీవుడ్‌లో ఖాళీ ఉండేది కాదు. కానీ, ఫ్లాప్స్ వల్ల ఇతర భాషలపై చూపు పడింది. హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. కానీ, అవి శ్రీలీలకి ఏమాత్రం క్రేజ్ తెస్తాయో తెలియని పరిస్థితి.

సాయి పల్లవి:

కథల విషయంలో ఎంతో సెలెక్టెడ్‌గా ఉండే సాయి పల్లవి తండేల్ తర్వాత తెలుగు కాకుండా హిందీ సినిమాల మీద ఫోకస్ చేసింది. ఆల్రెడీ ఆమె నటించిన 'ఏక్ దిన్' ఫ్లాప్ సినిమాల ఖాతాలో చేరిపోయింది. ఇప్పుడు 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న మైథలాజికల్ మూవీ సిరీస్ రామాయణలో సీతగా అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే, సాయి పల్లవి పాత్రకి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. మరి, ఈ ఫిదా బ్యూటీకి బాలీవుడ్ ఎంతవరకూ కలిసి వస్తుందో రామాయణ విడుదల తర్వాత తేలిపోతుంది.

#Keerthy Suresh#Sreeleela#Sai Pallavi#Pooja Hegde
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి