సినిమా

Preity Mukhundhan: టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా బ్లాస్ట్ బ్యూటీ!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Preity Mukhundhan: ప్రీతి ముకుందన్..ఇప్పుడు మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన బ్యూటీ. 'ఓం భీమ్ బుష్' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ తమిళమ్మాయి. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చి ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత కన్నప్ప సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది.

Preity Mukhundhan: ప్రీతి ముకుందన్..ఇప్పుడు మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన బ్యూటీ. 'ఓం భీమ్ బుష్' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ తమిళమ్మాయి. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చి ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత కన్నప్ప సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది. అయితే, ఇటీవల అర్జున్ నటించిన బ్లాస్ట్ సినిమా ప్రీతికి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. దీంతో, ఇప్పుడు ఆర్సీ 17లో ఛాన్స్ దక్కించుకున్నట్టుగా సమాచారం.

సుకుమార్-రామ్ చరణ్‌ల RC 17:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించబోతున్న పాన్ ఇండియా సినిమా ఈ దసరాకి ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా, ఈ సినిమా కోసం మైత్రీ వారు కొత్త ఆఫీస్ కూడా తీసుకున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది చరణ్ కెరీర్‌లో తెరకెక్కనున్న 17వ సినిమా. ప్రస్తుతం, ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది.

ఇదే, బ్యానర్స్‌లో బుచ్చిబాబు సినిమా కూడా ఉండబోతోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌కి సంబందించిన వర్క్ ఒకేసారి జరుగుతోంది. సుకుమార్ తో చరణ్, బుచ్చిబాబుతో చిరంజీవి సినిమాలు చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ రెండు కూడా మైత్రీ-సుకుమార్ రైటింగ్స్ నిర్మించనున్నాయి. అయితే, నటీనటులతో పాటు హీరోయిన్ విషయంలోనూ పలువురు క్రేజీ బ్యూటీస్ పేర్లు వినిపితున్నాయి.

దీనిలో భాగంగానే బ్లాస్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రీతీ ముకుందన్‌కి చరణ్ సరసన ఛాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. చరణ్ సరసన ఈ బ్యూటీ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుందని సుకుమార్ అండ్ మైత్రీ వారు ప్రీతిని పరిశీలించారట. ఆల్రెడీ సుకుమార్ కథ కూడా ఆమెకి నరేట్ చేయగా..కథ, అందులో తన పాత్ర నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.

ఇదే, కాదు మరికొన్ని భారీ ప్రాజెక్ట్స్ కోసం కూడా ప్రీతి పేరును పరిశీలిస్తున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంతకముందు చేసిన సినిమాలకంటే బ్లాస్ట్ మూవీ ప్రీతి కెరీర్‌ను పర్‌ఫెక్ట్ ట్రాక్‌లో పెట్టిందనుకోవచ్చు. మరి, అఫీషియల్‌గా ఆర్సీ 17లో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించే విషయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

#Preity Mukhundhan#RC 17#Sukumar#Ram Charan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి