Tollywood: ఒకప్పుడు టాలీవుడ్‌ను ఊపేసిన 'బుట్టబొమ్మ' పూజా హెగ్డే జాతకం మళ్లీ తిరగబడబోతుందా? కొన్నాళ్లుగా సరైన హిట్ లేక, కొత్త ఆఫర్లు రాక సైలెంట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు ఊహించని కాంబినేషన్‌తో రీ-ఎంట్రీకి సిద్ధమైంది. స్టార్ హీరో సరసన అవకాశాలు కనుమరుగైన వేళ.. ఏకంగా టాలీవుడ్ మాస్ రాజా రవితేజతో జోడీ కట్టేందుకు లక్కీ ఛాన్స్ కొట్టేసిందని ఫిలింనగర్ లో టాక్ జోరుగా నడుస్తోంది.
వరుస విజయాలతో ఒకప్పుడు గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న పూజా, 'గుంటూరు కారం' సినిమా నుండి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యాక టాలీవుడ్‌కి పూర్తిగా దూరమైంది. దాదాపు మూడేళ్ల పాటు తెలుగు తెరపై కనిపించని ఈ భామ.. దుల్కర్ సల్మాన్ ‘శ్రీశ్రీ’ చిత్రంలో నటిస్తున్నప్పటికీ, ప్రాపర్ తెలుగు మాస్ సినిమాలో ఆమె కనిపించలేదు. ఈ క్రమంలో రవితేజ - శ్రీ విష్ణు కలయికలో రాబోతున్న క్రేజీ మల్టీస్టారర్ లో పూజా హెగ్డేని కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం.
దిల్ రాజు బ్యానర్‌లో 'సామజవరగమన' ఫేమ్ హాసిత్ గోలి తెరకెక్కిస్తున్న ఈ మాస్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో పూజా హెగ్డే పాత్ర చాలా గ్లామరస్‌గా ఉండబోతోందట. ఇప్పటివరకు రవితేజ, పూజా హెగ్డే కలసి నటించకపోవడంతో ఈ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ రాకముందే ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా, సంక్రాంతి రేసులో ఈ సినిమాను నిలబెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నప్పటికీ, షూటింగ్ షెడ్యూల్స్ బట్టి విడుదల తేదీ మారే అవకాశం ఉంది. ఏదేమైనా, చాలా కాలం తర్వాత ఒక పక్కా మాస్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న పూజా హెగ్డేకి ఈ సినిమా టాలీవుడ్‌లో మళ్లీ పూర్వవైభవాన్ని తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.












