క్రైమ్

Seediri Appalaraju Arrest: వైసీపీ నేత, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

రచన: NK4 నిమిషాల పఠనం

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. తన కొడుకు ఆరవ్ వర్మ హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం కాశీబుగ్గలోని సీదిరి అప్పలరాజు ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కొడుకును కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారని సీదిరిపై కేసు నమోదైంది.

Seediri Appalaraju Arrest: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. తన కొడుకు ఆరవ్ వర్మ హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం కాశీబుగ్గలోని సీదిరి అప్పలరాజు ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీదిరి అప్పలరాజును పోలీసులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో కొడుకును కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారని సీదిరిపై కేసు నమోదైంది.

కాశీబుగ్గలో సీదిరి ఆరవ్ వర్మ చేసిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. సీదిరి ఆరవ్ వర్మపై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఈ కేసులో అప్పలరాజు ఏ3గా ఉన్నారు. ఈ కేసు నుంచి తన కుమారుడిని తప్పించేందుకు అప్పలరాజు ప్రయత్నం చేశారని.. రోడ్డు ప్రమాదంలో ఆధారాలు మార్చారని, కొడుకు స్థానంలో మరొక వ్యక్తిని ఉంచారని పోలీసుల విచారణలో తేలింది. బాధిత కుటుంబాన్ని ప్రలోభ పెట్టడంతో పాటు నేరం కప్పి పుచ్చే యత్నం చేశారని సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నెల 10న సీదిరి అప్పలరాజు కుమారుడు సీదిరి ఆరవ్ వర్మ బైక్ తో ఢీకొట్టడంతో గొర్రెల కాపరి దానయ్య చనిపోయాడు. హిట్ అండ్ రన్ కేసులో ఇప్పటికే సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ రిమాండ్ లో ఉన్నాడు. కాగా, పోలీసుల తీరుపై అప్పలరాజు ఫైర్ అయ్యారు. యాక్సిడెంట్ కేసులో సంబంధం లేని సెక్షన్లు పెడుతున్నారని ఆరోపించారు.

కాగా, సీదిరి అప్పలరాజు ఇంటికి పోలీసులు వచ్చారన్న విషయం తెలుసుకుని వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి. ఆయనను అరెస్ట్ చేయకుండా వైసీపీ శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులు అప్పలరాజును అక్కడి నుంచి తీసుకెళ్లారు. హిట్ అండ్ రన్ కేసులో అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మను ఏ1గా, సీదిరి అనుచరుడు సిద్ధార్థ ఏ2గా, సీదిరి అప్పలరాజు ఏ3గా ఉన్నారు.

#Seediri Appalaraju Arrest#Seediri Appalaraju#Hit And Run Cas#Seediri Aarav Varma#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి