క్రైమ్

Saree Dispute: బాబోయ్.. కొత్త చీరలు తేలేదని.. కుక్కర్ మూతతో కొట్టి భర్తను చంపిన భార్య

రచన: NK4 నిమిషాల పఠనం

భార్య చేతిలో భర్త హతం అనే వార్తలు ఆగడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రియుడి మోజులో కొందరు, డబ్బు ఆశతో మరికొందరు, వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఇంకొందరు.. కట్టుకున్న భర్తనే కడతేరుస్తున్నారు. ఇక, చిన్న చిన్న కారణాలకే భర్తలను హతమారుస్తున్న వైనం షాక్ కి గురి చేస్తోంది. తాజాగా మహారాష్ట్రలో దారుణం జరిగింది. చీర కోసం మొదలైన గొడవ భర్తను హత్య చేసే వరకు వెళ్లింది. తనకు చీర తీసుకురాలేదని భార్య తన భర్తను చంపేసింది.

Saree Dispute: భార్య చేతిలో భర్త హతం అనే వార్తలు ఆగడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రియుడి మోజులో కొందరు, డబ్బు ఆశతో మరికొందరు, వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఇంకొందరు.. కట్టుకున్న భర్తనే కడతేరుస్తున్నారు. ఇక, చిన్న చిన్న కారణాలకే భర్తలను హతమారుస్తున్న వైనం షాక్ కి గురి చేస్తోంది. తాజాగా మహారాష్ట్రలో దారుణం జరిగింది. చీర కోసం మొదలైన గొడవ భర్తను హత్య చేసే వరకు వెళ్లింది. తనకు చీర తీసుకురాలేదని భార్య తన భర్తను చంపేసింది.

బద్లాపూర్ ఈస్ట్ లో ఈ ఘోరం జరిగింది. హరిరామ్ సింగ్ (35), సునీత (30) దంపతులు. వీళ్ల స్వస్థలం బిహార్. ఉపాధి కోసం మహారాష్ట్ర వచ్చారు. బద్లాపూర్ ఈస్ట్ లో 9ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు.

కాగా, చీర కొని తేలేదని భార్య సునీత భర్తతో గొడవ పెట్టుకుంది. ఈ గొడవ చూస్తుండగానే పెద్దదిగా మారింది. ఈ క్రమంలో కుక్కర్ మూతతో భర్తను కొట్టి చంపేసింది. ఆపై తనకేమీ తెలీదు అన్నట్లుగా యాక్ట్ చేసింది. తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలో గుండెపోటు వచ్చి తన భర్త చనిపోయాడని డ్రామా ఆడింది. అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమె చెప్పింది నిజమే అని అంతా నమ్మేశారు కూడా.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ నిజం తెలిసింది. అది సహజ మరణం కాదు మర్డర్ అని తేలింది. మృతుడి శరీరంపై గాయాలను గమనించారు డాక్టర్లు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు భార్య సునీతను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్ లో విచారించారు. అంతే, సునీత నిజం కక్కేసింది. కుక్కర్ మూతతో కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని అంగీకరించింది. పోలీసులు సునీతపై హత్య కేసు నమోదు చేశారు. ఆమెని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.

#Saree Dispute#Thane#Maharashtra#Wife#Husband#Pressure Cooker Lid
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి