సినిమా

Parasuram: గీత గోవిందం డైరెక్ట‌ర్‌కు నంద‌మూరి హీరో గ్రీన్ సిగ్న‌ల్‌.!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Parasuram: ‘గీత గోవిందం’తో టాలీవుడ్‌లో సరికొత్త మేజిక్ క్రియేట్ చేసిన దర్శకుడు పరశురామ్ పేట్లా, గత కొంతకాలంగా తన తదుపరి ప్రాజెక్ట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ ఫలితం తర్వాతి నుంచి కాస్త నెమ్మదించిన ఆయన, నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఒక పక్కా కథను సిద్ధం చేసుకున్నారు. ఈ స్క్రిప్ట్‌తో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ అగ్ర హీరోల తలుపులు తట్టినప్పటికీ, రకరకాల కారణాల వల్ల ఎవ‌రూ ముందుకు రాలేదు.

Parasuram: ‘గీతా గోవిందం’తో టాలీవుడ్‌లో సరికొత్త మేజిక్ క్రియేట్ చేసిన దర్శకుడు పరశురామ్ పేట్లా, గత కొంతకాలంగా తన తదుపరి ప్రాజెక్ట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ ఫలితం తర్వాతి నుంచి కాస్త నెమ్మదించిన ఆయన, నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఒక పక్కా కథను సిద్ధం చేసుకున్నారు. ఈ స్క్రిప్ట్‌తో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ అగ్ర హీరోల తలుపులు తట్టినప్పటికీ, రకరకాల కారణాల వల్ల ఎవ‌రూ ముందుకు రాలేదు.

అయితే, ఎట్టకేలకు ఆయన నిరీక్షణకు తెరపడినట్లే కనిపిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్‌ను కలిసిన పరశురామ్, ఆయనకు తాను రెడీ చేసుకున్న స్టోరీని వినిపించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పరశురామ్ మార్క్ వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలు ఉన్న ఈ లైన్ కళ్యాణ్ రామ్‌కు విపరీతంగా నచ్చేయడంతో, ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్, విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే పరశురామ్ డైరెక్షన్‌లో నటింపబోయే చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరగ‌నున్నాయ‌ని అంటున్నారు. మరో విశేషమేమిటంటే.. ఈ క్రేజీ కాంబినేషన్‌ను దిల్‌రాజు బ్యానర్‌లో పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ రామ్, పరశురామ్ మేకింగ్ శైలి కలవడం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

#nandamurikalyanram#parasuram#geethagondam#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి