Spirituality

Spirituality: దాస్య భక్తి అంటే ఏంటి?.. నిజమైన సేవకు అసలైన అర్థం ఇదే!

రచన: Venu5 నిమిషాల పఠనం

ఈ ప్రపంచాన్ని ఏదోశక్తి నడిపిస్తుంది అన్న విషయం అందరికి తెలిసిందే. ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలని ఇప్పటివరకు ఎందరో ప్రయత్నించారు. ప్రయత్నిస్తున్నారు కూడా.. కానీ ఈ విశ్వాన్ని కేవలం మన కళ్లకు కనిపించేదానితోనే కొలవలేం.

ఈ ప్రపంచాన్ని ఏదోశక్తి నడిపిస్తుంది అన్న విషయం అందరికి తెలిసిందే. ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలని ఇప్పటివరకు ఎందరో ప్రయత్నించారు. ప్రయత్నిస్తున్నారు కూడా. కాని వారు తెలుసుకునే విషయాలను సైన్స్ తో ముడి పెడుతున్నారు. అయితే ఈ ప్రపంచంలో సైన్స్ కూడా అంతుచిక్కని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అందుకే.. ఈ విశ్వాన్ని కేవలం మన కళ్లకు కనిపించేదానితోనే కొలవలేం.

ఇకపోతే ఈ సృష్టి అంతా భగవంతుని ప్రేమ మయంతో నిండుకొని ఉన్నది. ఆ ప్రేమ అనే పదంలోకి సేవ అనే భావం కూడ వస్తుంది. ఒక వ్యక్తికి సేవ చేయాలంటే అతని పట్ల సేవచేసే వారికి ప్రేమ కలగాలి.. ఇది మనషులకు సంబంధించిన విషయమైన.. పూర్తి సేవ గురించి తెలుసుకుంటే అద్భుతం అనిపిస్తుంది. అదే దాస్య భక్తిలోని సేవ ఇంకా ఉన్నతమైనది. ఎందుకనగా ఈ మార్గంలో భక్తుడు స్వతంత్రంగా ఏ నిర్ణయాలు తీసుకోవడం జరగదు..

ఎందుకంటే.. దాస్య భక్తిలో భక్తుడు తనను తాను భగవంతుని సేవకుడిగా భావిస్తాడు. నేను, నాది అనే అహంకారాన్ని పక్కనపెట్టి.. తన జీవితాన్ని దైవకార్యానికి అంకితం చేస్తాడు. భగవంతుని ఆదేశాలను పాటిస్తూ.. జ్ఞానుల ఉపదేశాలను అనుసరిస్తూ.. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రేమతో, భక్తితో, నిస్వార్థంగా సేవ చేయడమే దాస్య భక్తి.. శ్రీరాముడి పట్ల హనుమంతుడి భక్తి దీనికి గొప్ప ఉదాహరణ.

తన శక్తి, తన జ్ఞానం, తన జీవితాన్ని అన్నింటినీ శ్రీరాముడి సేవకే అంకితం చేశాడు ఆ స్వామి. ఇదంతా తన కోసం కాదు.. పేరు కోసం కాదు.. కీర్తి కోసం కాదు.. కాబట్టి అదే నిజమైన దాస్య భక్తి.. ఇక జగమే సర్వం విష్ణుమయం అనే భావనతో.. ప్రతి జీవిలోనూ దైవాన్ని చూడటం.. మనకు ఉన్నది ఏదీ శాశ్వతంగా మనది కాదని తెలుసుకోవడం.. తాను భగవంతుని సేవకుడిననే భావనతో జీవించడం.. ఇదే దాస్య భక్తి యొక్క అసలైన సారాంశం.

అయితే.. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే.. గాలి కలుషితమవుతున్నట్లే.. మనిషి ఆలోచనలు కూడా కలుషితమవుతున్నాయి. సేవలో కూడా స్వార్థం కనిపిస్తోంది. సహాయం చేసినా.. గుర్తింపు కావాలి. దానం చేసినా.. పేరు రావాలి. భక్తితో పూజలు చేసినా.. కోరికలు నెరవేరాలి అనే ఆలోచనలతో భక్తులు నిండిపోయారు. కానీ నిజమైన దాస్య భక్తికి ప్రతిఫలాపేక్ష ఉండదు.

నేను భగవంతుని కోసం ఏమి చేయగలను? అనే ఆలోచన మొదలైన క్షణమే.. నిజమైన భక్తి మొదలవుతుంది. స్వార్థాన్ని వదిలి.. అహంకారాన్ని విడిచి.. సర్వజీవుల్లో భగవంతుడిని చూస్తూ.. నిస్వార్థంగా సేవ చేయడమే నిజమైన సేవ. అదే నిజమైన భక్తి.. అదే దాస్య భక్తి... కానీ మనిషి ఇలా మారాలంటే మనస్సు ఒప్పుకోవాలి కదా!.. అందుకే నేటి సమాజంలో మనుషులు భక్తిగా ఉన్నాము.. భక్తితో పూజలు చేసుకుంటున్నాము.. ఆలయాలకు వెళ్తున్నామనే భ్రమలో బ్రతుకుతున్నారని పండితులు అంటున్నారు..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంకేతిక సమాచారం. సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలని మనవి..

#India#spirituality#Dasya Bhakti#meaning#genuine service
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి