సినిమా

Tollywood: ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ నిలబడాలంటే కాకా హిట్ అయితేనే సాధ్యం!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Tollywood: ఒక భారీ బడ్జెట్ సినిమా చాలు..ఒక అగ్ర నిర్మాణ సంస్థ మరో నాలుగు సినిమాలు ప్రకటించాలన్నా, పాతాళంలోకి కూరుకుపోవాలన్నా. ప్రస్తుతం కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ పరిస్థితి ఇలాగే ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో ఇప్పుడు చిరంజీవి మాత్రమే వీరిని గట్టెక్కించేలా కనిపిస్తున్నాడు. ఆయన నటిస్తున్న కాకా హిట్ అయితేనే ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ నిలబడుతుంది.

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వందల కోట్లు సంపాదించిన వెంకట్ కె నారాయణ, ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్‌గా ఎంటరయ్యాడు. అక్కడి వరకూ బాగానే ఉంది. ఎప్పుడైతే ఆయన నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడో..అప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ నుంచి వచ్చిన ప్రతీ సినిమా ఫ్లాపవుతూ ఉంది. దీంతో, వందల కోట్ల నష్టాలను ఈ సంస్థ చూసింది.

నాలుగేళ్ల నుంచి నిర్మాణంలో ఉన్న టాక్సిక్ మీదే వెంకట్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. కానీ, ఆ సినిమా ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ వచ్చిన యష్ ఒక్కడుంటే సినిమా హిట్ అవదని తాజాగా వచ్చిన టాక్సిక్ నిరూపించింది. కొందరైతే, ఇందులో యష్ పర్ఫార్మెన్స్ చూసి ఇంకా ఈ రాకింగ్ స్టార్ కేజీఎఫ్ హ్యాంగోవర్ నుంచి బయటకి రాలేదని మాట్లాడుకున్నారు. ఏదేమైనా టాక్సిక్‌తో నిలబడాలనుకున్న వెంకట్ ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి.

ఇప్పుడు, ఈ అగ్ర నిర్మాణ సంస్థను ఆదుకోగల ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. బాబీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కాకా సినిమా 2027, సంక్రాంతికి రాబోతోంది. విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా గనక హిట్ సాధించి లాభాలను తెస్తే ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్‌ను ప్రకటించవచ్చు అంటున్నారు. లేదంటే ప్రొడక్షన్ ఆపే అవకాశం లేకపోలేదట. చూడాలి, మరి..'కాకా' వీరిని గట్టెక్కిస్తాడా లేదా.

#kvn productions#venkat k narayana#megastar chiranjeevi#kaaka#bobby
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి