క్లాస్‌కు బుక్ తీసుకురాలేదని టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. ఏమైందో తెలీదు వెంటనే అనారోగ్యానికి గురైన స్టూడెంట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బుక్ తీసుకుని రాకపోతే మందలించాలి కానీ ఇలా పనిష్మెంట్ ఇవ్వడం వలన పోయిన తమ బిడ్డ తిరిగి వస్తుందా? అని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పాఠశాల యాజమాన్యాన్ని వారు డిమాండ్ చేశారు.
వివరాల్లోకివెళితే.. బుక్ తీసుకుని రాలేదన్న కోపంతో పదేళ్ల విద్యార్థినిని క్లాస్ టీచర్ ఎండలో నిలబెట్టింది.అయితే, కాసేపటికే విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురైంది. అనంతరం స్కూల్ యాజమాన్యం పేరెంట్స్‌కు సమాచారం అందించారు. దాంతో విద్యార్థిని తల్లి అంజలి వెంటనే హుటాహుటిన స్కూల్‌కు వెళ్లింది. వెళ్లేసరికి అక్కడ కూతురు ఎండలో నిలబడి ఉండటాన్ని గమనించింది.అప్పటికే ఆరోగ్యం క్షీణించడంతో కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లింది.
డాక్టర్లు చికిత్స అందించగా.. ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలోనే గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచింది. ఢిల్లీలోని వినోద్ నగర్‌లో గల సర్వోదయ కన్యా విద్యాలయంలో ఈ ఘటన గత నెల 27న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. పుస్తకం తీసుకెళ్లలేదని టీచర్ ఎండలో నిలబెట్టడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని బాధిత పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
అలా చేయడం వల్లే ఆమె ఆరోగ్యం క్షీణించిందని వాపోయింది. తమకు న్యాయం చేయాలని ఆ తల్లి రోధించిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. ఇదిలాఉండగా, నష్టనివారణ చర్యల్లో భాగంగా సదరు టీచర్ మీద స్కూల్ మేనెజ్మెంట్ చర్యలు చేపట్టింది.ఆమెను బదిలీ చేసింది. ఈ ఘటనపై ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి రావడంతో విచారణకు ఢిల్లీ సర్కార్ ఆదేశించింది. కాగా, పేరెంట్స్ సైతం ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించగా..ఆలస్యంగా విషయం వెలుగుచూసింది.
https://x.com/pulsenewsbreak/status/2094602893278007760?s=20












