International

Cyber crime: సైబర్‌ నేరగాళ్ల కొత్త స్కెచ్‌.. విరాళాల పేరుతో ఆన్‌లైన్ దోపిడీ!..

రచన: Venu6 నిమిషాల పఠనం

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. దోచుకోవడానికి అవకాశం ఉన్న ఏ మార్గాలను కూడా వదలడం లేదు. మానవత్వం మరచి డబ్బు సంపాదనే ధ్యేయంగా సమాజం సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారు..

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. దోచుకోవడానికి అవకాశం ఉన్న ఏ మార్గాలను కూడా వదలడం లేదు. మానవత్వం మరచి డబ్బు సంపాదనే ధ్యేయంగా సమాజం సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారు.. నేపాల్ లో ప్రకృతి సృష్టించిన ప్రళయం బారిన పడి వేలాది మంది నిరాశ్రయులుగా మారిన సంగతి తెలిసిందే.. కొందరికి ఒంటి మీది బట్టలు తప్ప ఏం మిగలలేదు. మరికొందరు అయిన వాళ్ళను పోగొట్టుకుని అనాధలుగా మిగిలారు. మొత్తానికి ఈ ఘటన అంతులేని విషాదాన్ని మిగిల్చింది.

అయితే ఈ దారుణ విపత్తును సైతం సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. నేపాల్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తున్న దాతల మానవత్వాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు, ఫేక్ క్యూఆర్ కోడ్‌లు సృష్టించి వరద బాధితులకు సాయం చేయండి.. అంటూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఆగస్టు 26న నేపాల్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే..

ఈ విపత్తులో చిక్కుకున్న బాధితులను ఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా ఇదే సమయాన్ని సైబర్ ముఠాలు తమకు అనుకూలంగా మలుచుకుని దాతల నుంచి డబ్బులు కాజేసేందుకు సరికొత్త వ్యూహాలకు తెరతీసినట్టు అధికారులు గుర్తించారు.. ఈ క్రమంలో వరద బాధితుల సాయం పేరుతో ఫేస్‌బుక్, వాట్సాప్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, వైబర్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధి వరద బాధితుల సహాయం పేర్లతో నకిలీ పేజీలు, గ్రూపులు సృష్టించారు.

అంతేకాకుండా అధికారిక ప్రభుత్వ లోగోలను సైతం కాపీ కొట్టి, నకిలీ క్యూఆర్ కోడ్‌లను తయారు చేసి గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. దాతలు అవి నిజమైన ప్రభుత్వ ఖాతాలే అని నమ్మి స్కాన్ చేసి డబ్బు పంపితే.. ఆ నిధులన్నీ నేరగాళ్ల వ్యక్తిగత అకౌంట్లలోకి లేదా ఈ- వాలెట్లలోకి వెళ్తున్నాయి. ఇంతటితో ఆగని ఈ కేటుగాళ్లు రిలీఫ్ రిజిస్ట్రేషన్ పేరుతో ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేస్తున్నారు. ఫిషింగ్ లింకులు పంపిస్తూ, వివరాలు నమోదు చేయాలని చెబుతూ బ్యాంకు ఖాతా నంబర్లు, ఓటీపీలు అడిగి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

మరికొందరు నేరగాళ్లు ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి కాల్ చేసి.. నేను వరదల్లో చిక్కుకున్నాను, సేఫ్‌గా ఉన్నాను.. అర్జెంట్‌గా డబ్బులు పంపండి అంటూ బంధువుల పేరిట ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.. ఇక ఈ మోసాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నట్టు తెలుస్తుంది. ఓ ప్రబుద్ధుడు అయితే ఏకంగా తాను ప్రధాని సహాయ నిధికి రూ. 1.2 లక్షలు విరాళం ఇచ్చినట్లు.. సోషల్ మీడియాలో చాట్‌జీపీటీని ఉపయోగించి నకిలీ రసీదును సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది..

ఈ నేరగాడు నేను సాయం చేశాను, మీరూ చేయండి అంటూ తన సొంత క్యూఆర్ కోడ్ జతచేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది నిజమని నమ్మిన పలువురు ఆ క్యూఆర్ కోడ్‌కు డబ్బు పంపి మోసపోయారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని ట్రేస్ చేసి అరెస్ట్ చేసినట్టు సమాచారం.. మరోవైపు వరద బాధితులకు నిజంగా సహాయం చేయాలనుకునేవారు కేవలం అధికారిక మార్గాల ద్వారానే విరాళాలు ఇవ్వాలని అధికారులు తెలియజేస్తున్నారు.

సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులు, క్యూఆర్ కోడ్‌లు, వ్యక్తిగత అకౌంట్ నంబర్లను అస్సలు నమ్మవద్దని, విరాళం పేరిట ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ, పిన్ నంబర్, డెబిట్ క్రెడిట్ కార్డ్ వివరాలు అడిగే వారిపట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని అలాంటి వారికి మీ వివరాలు ఇవ్వవద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే సమీప పోలీసు స్టేషన లో వెంటనే ఫిర్యాదు చేయాలని పేర్కొంటున్నారు..

#national news#Nepal Floods#cyber crime#QR code#Online fraud#donations#new plan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి