పిల్లల సంతోషం, భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. ఒక పూట తిన్నా తినకున్నా వారికి మాత్రం కడుపునిండా భోజనం పెట్టాలని ఆలోచన చేస్తుంటారు.ఇలాంటి పేరెంట్స్ ఉండటం వల్లే కటికపేదరికంలో జన్మించినా కొందరు తమ ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతున్నారు. ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. పిల్లలు ప్రగతి బాటలో నడిచారంటే దాని వెనుక పేరెంట్స్ కృషి ఎంతో ఉంటుంది.తాజాగా ఉదాహరణ ఇందుకు అద్దం పడుతుంది.
కూతురి చదువుకోసం ఓ తల్లి పెద్ద సాహసమే చేసింది. ఆరోగ్యం సహకరించకున్నా తనను తాను మర్చిపోయి పరుగు పందెంలో పాల్గొంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కిలో మీటర్లు ఆగకుండా పరుగు పూర్తి చేసింది. వివరాల్లోకివెళితే.. కూతురి చదువు కోసం చెప్పులు లేకుండా మారథాన్ ఓ తల్లి మారథన్ గెలిచింది.ఆమె పేరు రమాబాయి, వయసు 47 సంవత్సరాలు.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగాయి ప్రాంతానికి చెందిన ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త చనిపోవడంతో ఇంటి పని చేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. అయితే, మారథాన్‌లో పాల్గొంటే ప్రైజ్‌మనీ వస్తుందని తెలుసుకున్న రమాబాయి.. మరో ఆలోచన చేయకుండా అమృత్ దౌడ్ పేరుతో నిర్వహించిన మారథాన్‌లో పాల్గొంది. రేసులో చెప్పులు తెగిపోయినా ఆగిపోకుండా చేతిలో పట్టుకొని పరుగు కొనసాగించింది.
చివరికి 3 కిలోమీటర్ల మారథాన్ పూర్తి చేసి రూ.3 వేల నగదు బహుమతి అందుకుంది.అది చిన్న మొత్తమే అయినా కూతురి ఫీజు కోసం ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేసింది ఆ తల్లి.. రమాబాయి ఆ మాట చెప్పగానే అక్కడున్న వాళ్లు ఉద్వేగానికి లోనై ఆమెను అభినందించారు. చేతిలో చెప్పులు పట్టుకుని రమాబాయి పరిగెత్తుతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://x.com/pulsenewsbreak/status/2094610946488500534?s=20











