సినిమా

Tollywood: ప్రేమలో కావ్య, కాల భైరవ..ఇది ఎవరూ ఊహించనిది!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Tollywood: ఇప్పటికే మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. రీల్ లైఫ్‌లో భార్యభర్తలుగా నటించిన వారు రియల్ లైఫ్‌లో ఒక్కటైన జంటలు మన టాలీవుడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహ, నాగ చైతన్య-శోభిత ధూళిపాళ, ఆర్య-సాయేషా సైగల్..ఇలా చాలామంది ఉన్నారు.

Tollywood: ఇప్పటికే మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. రీల్ లైఫ్‌లో భార్యభర్తలుగా నటించిన వారు రియల్ లైఫ్‌లో ఒక్కటైన జంటలు మన టాలీవుడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహ, నాగ చైతన్య-శోభిత ధూళిపాళ, ఆర్య-సాయేషా సైగల్..ఇలా చాలామంది ఉన్నారు.

సింగర్స్‌లోనూ చాలామంది ఉన్నారు. గీతా మాధురి-నటుడు నందు, ప్రణవి-డాన్స్ మాస్టర్ రఘు, సింగర్స్ హేమచంద్ర-శ్రావణ భార్గవి..ఇలా మన టాలీవుడ్‌లో చాలాపెద్ద లిస్టే ఉంది. అయితే, ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ అయిన ఎం.ఎం.కీరవాణి తనయుడు కాల భైరవ, యువ నటి కావ్య కళ్యాణ్‌రామ్ ప్రేమలో ఉన్నట్టుగా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలిపారు.

మనసంతా నువ్వే సినిమాతో కావ్య కళ్యాణ్‌రామ్ చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. ఇక, పెద్దయ్యాక బలగం సినిమాతో హీరోయిన్‌గా బాగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ, వరుసగా మాత్రం సినిమాలు ఒప్పుకోలేదు. దాంతో, ఎందుకు కావ్య కళ్యాణ్‌రామ్ సినిమాలను ఒప్పుకోవడం లేదు..మంచి కథలు రావడం లేదా, లేక అవకాశాలు ఇవ్వడం లేదా అనుకున్నారు. కానీ, అసలు విషయం ఇదని ఇప్పుడు తెలిసింది.

కాల భైరవ సంగీత దర్శకుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. అంతేకాదు, తన గాత్రంతోనూ మంచి పాటలను పాడుతూ ఆకట్టుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో 'నాటు నాటు' సాంగ్ పాడాడు. ఈ పాటకి ఆస్కార్ వచ్చింది. ఇందులోనే 'కొమరం భీముడో' సాంగ్ పాడాడు. 'బాహుబలి 2'లో 'దండాలయ్య', 'అరవింద సమేత'లో 'పెనివిటి' సాంగ్ పాడాడు. కాల భైరవ పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక, కాల భైరవ-కావ్య కళ్యాణ్‌రామ్ ల ప్రేమ విషయం తెలిసి టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్ళి వార్త ఎప్పుడు..ఏడేట్..ప్లేస్ ఎక్కడా అనే చర్చ మొదలైంది.

#kavya kalyan ram#kala bhairava#tollywood#mm keeravani
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి