Jailer-2 : ఇండియా, అమెరికా మాత్రమే కాకుండా చైనా, జపాన్ లాంటి అగ్ర దేశాలలోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత మళ్ళీ అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్. పాన్ ఇండియన్ సినిమా అనకముందే రజినీ సినిమాలు ఇండియాతో పాటు ఇతర దేశాలలోనూ తమిళ (ఒరిజనల్) భాషలో రిలీజై అసాధారణమైన వసూళ్ళను రాబట్టేవి. ఎప్పుడైతే ప్రభాస్ బాహూబలి పార్ట్ 1తో గ్లోబల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడో..అప్పటి నుంచి డార్లింగ్‌కి చైనా, జపాన్‌లలో విపరీతంగా ఫ్యాన్స్ పెరిగారు.
అందుకే, వీరి సినిమాల నుంచి అనుకున్న సమయానికి అప్‌డేట్స్ గనక రాకపోతే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నేరుగా మ్రేకర్స్‌పైనే కామెంట్స్ పెట్టడం, ట్రోల్స్ చేయడం చూస్తూనే ఉన్నాము. అలాంటి, వాటికి ప్రభాస్ డైరెక్టర్స్ రిప్లై ఇస్తుంటారు. ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ సినిమా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే, సినిమా ఆలస్యం అవుతుంది. కానీ, మిమ్మలిని గ్యారెంటీగా ఎంటర్‌టైన్ చేస్తామని కూల్ చేసిన రోజులూ ఉన్నాయి.
ఇప్పుడు, రజినీ ఫ్యాన్స్ కి కూడా ఇలాంటి ఓదార్పేకావాల్సి వస్తోంది. బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ కి సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ లో రజినీని చూపించిన విధానానికి ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ లవర్స్ కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యారు. రిపీటెడ్‌గా సినిమాను థియేటర్స్‌లో చూశారు. అలాగే, ఓటీటీ..స్మాల్ స్క్రీన్ మీద కూడా. అందుకే, పార్ట్ 2 మీద ఆసక్తి రెట్టింపైంది.
పైగా జైలర్ 2లో ఎస్.జె.సూర్య, మిథున్ చక్రవర్తి, రమ్యకృష్ణ, విధ్యబాలన్ కీలక పాత్రల్లో నటిస్తుండటం. పూర్ణ స్పెషల్ నంబర్ లో కనిపించడం. ఇవన్నీ సినిమాకి ప్రధాన బలంగా మారనున్నాయి. వాస్తవానికి ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత దసరా బరిలో అక్టోబర్ 15న దింపాలనుకున్నారు. కానీ, ఇంకా పూర్తి స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కాలేదట. దాంతో మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇలా వార్తలు స్ప్రెడ్ అవడానికి కారణం మేకర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడమే. దీనిపై, క్లారిటీ ఇవాల్సి ఉంది.










