తెలంగాణ

Cm Revanth Reddy: కేసీఆర్ ఖర్చు రూ.22కోట్లు.. వెంటనే రాజీనామా చేయాలి- సీఎం రేవంత్ సంచలన డిమాండ్

రచన: NK5 నిమిషాల పఠనం

Cm Revanth Reddy: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు విఫలం అయ్యారని విమర్శించారు. వెయ్యి రోజుల్లో కేసీఆర్ రూ.1.24 కోట్ల జీతం తీసుకున్నారని, కేసీఆర్ భద్రత కోసం 21 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సీఎం రేవంత్ తెలిపారు.

Cm Revanth Reddy: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు విఫలం అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ వెయ్యి రోజుల పాలనలో కేసీఆర్ రూ.1.24 కోట్ల జీతం తీసుకున్నారని తెలిపారు. ఇక కేసీఆర్ సెక్యూరిటీ, ఇల్లు, కాపలా, బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం ప్రభుత్వం 21 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సీఎం రేవంత్ వెల్లడించారు. జీతం తీసుకుని ఉద్యోగానికి రాకపోతే ఏం చేయాలి? అని సీఎం రేవంత్ నిలదీశారు. మొత్తంగా 22 కోట్ల 24 లక్షల 40వేల రూపాయల ప్రభుత్వ సొమ్మును కేసీఆర్ మెక్కారని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.

ఈ వెయ్యి రోజుల్లో ప్రజల కోసం కేసీఆర్ ఒక్కసారైనా బయటకు వచ్చారా? కనీసం ఒక్కసారైనా ప్రజల గురించి ఆలోచన చేశారా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా ప్రభుత్వాల వైఫల్యం చూశాము.. కానీ తెలంగాణలో ప్రతిపక్షం వైఫల్యం చెందిందని విమర్శించారు. దేశంలో ప్రతిపక్ష నేత విఫలమైన తొలి రాష్ట్రం తెలంగాణ అని ధ్వజమెత్తారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునివ్వడంపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు.

మూడేళ్లలో ఒక్కరోజైనా ప్రజల కోసం పని చేయని ప్రతిపక్ష నేత కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సీఎం రేవంత్ సంచలన డిమాండ్ చేశారు. కేసీఆర్ రాజీనామా డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. సెప్టెంబర్ 6వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాలన్నారు.

''కేసీఆర్‌ 1000 రోజుల్లో కోటి 24 లక్షల 40 వేల రూపాయలు జీతం తీసుకున్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి 365 రోజులు ఉద్యోగానికి హాజరుకాకపోతే డిస్మిస్‌ చేస్తారు. మరి కేసీఆర్‌ను ఏం చేయాలి? ప్రతిపక్ష నేత హోదా ఉన్నందుకు ఆయనకు ఇన్ని రోజులు సెక్యూరిటీ, ఇల్లు, బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు తదితర వసతుల కోసం ప్రభుత్వం రూ.21 కోట్లు ఖర్చు చేసింది. ప్రతిపక్ష నేతగా విఫలమైన కేసీఆర్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా కోరుతూ ప్రజలు ఊరూరా ఆందోళనలు చేయాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌ మూసారాంబాగ్ లో మూసీ నదిపై నిర్మించిన కొత్త వంతెనను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. గత బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధ్యం కాని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే పూర్తి చేసి చూపిందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కుటుంబసభ్యులు, బంధువులకు పదవులు ఇచ్చారన్న రేవంత్ రెడ్డి.. ప్రజా ప్రభుత్వంలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవులు ఇచ్చామని పేర్కొన్నారు.

#Cm Revanth Reddy#Brs#Kcr#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి