సినిమా

NTR-NEEL: అక్టోబర్ నుంచి డ్రాగన్ సెట్స్‌లో తారక్!

రచన: Anshu4 నిమిషాల పఠనం

NTR-NEEL: టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలలో డ్రాగన్ ఒకటి. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్.టి.ఆర్. హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్స్‌లో ఎన్.టి.ఆర్. భుజానికి గాయం అవడంతో అప్పటి నుంచి షూటింగ్‌కి బ్రేక్ పడింది. తాజా సమాచారం మేరకు మళ్ళీ ఎన్.టి.ఆర్. అక్టోబర్ మొదటి వారం నుంచి సెట్స్‌లో జాయిన్ కాబోతున్నాడట.

ఉగ్రం, కేజీఎఫ్ సిరీస్, సలార్ చిత్రాలతో ఇంచుమించు రాజమౌళి రేంజ్ క్రేజ్‌ను పాన్ ఇండియా వైడ్‌గా తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. దాంతో, మన టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, హోంబలే సంస్థలు అడ్వాన్స్ ఇచ్చి నీల్‌ని లాక్ చేసుకున్నాయి. ఇప్పటికే, ప్రభాస్‌తో సలార్ చిత్రాన్ని తీసి సంచలనం సృష్ఠించాడు. పార్ట్ 1 క్లైమాక్స్‌లోనే సలార్ 2 కూడా ఉందని క్లారిటీ ఇచ్చాడు.

అయితే, వెంటనే సలార్ 2 ఉంటుందని అందరూ భావించారు. కానీ, కథకి ఇంకా సమయం పట్టడం..ఆల్రెడీ ఎన్.టి.ఆర్. తో సినిమాను కమిటై ఉండటంతో ముందు డ్రాగన్ సినిమాను సెట్స్‌పైకి తెచ్చాడు నీల్. అయితే, ఈ సినిమాను మాత్రం గత చిత్రాల మాదిరిగా కంప్లీట్ గ్రే కలర్ ప్యాట్రన్ లో తీయడం లేదట. ఆల్రెడీ కేజీఎఫ్ సిరీస్, సలార్ ఇదే కలర్ బ్యాక్ డ్రాప్ లో చూసిన ఆడియన్స్ కి కాస్త బోర్ అనిపించింది.

అది, గ్రహించిన ప్రశాంత్ నీల్ ఎన్.టి.ఆర్. తో చేస్తున్న డ్రాగన్ కి మాత్రం ఫ్లాష్ బ్యాక్ మొత్తం కలర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట. దీంతో, సినిమాను రెండు రకాల నరేషన్‌లో చూపించవచ్చు..రెండు టైం పీరియడ్స్ మధ్య తేడాను ఎస్టాబ్లిష్ చేయవచ్చు. అదందుకే, ఇలా ప్లాన్ చేశాడట. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

#ntr#prashanth neel#ntrneel#dragon#rukmini vasanth
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి