సినిమా

Rashmika Mandanna: రణబాలి సెట్స్‌లోకి రష్మిక రీ ఎంట్రీ..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న మళ్ళీ షూటింగ్‌లో జాయిన్ కాబోతోంది. తాజాగా, దీనికి సంబందించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్వయంగా, రష్మిక తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. మైసా సినిమా షూటింగ్ సమయంలో రష్మిక నడుముకు గాయం అయిన కారణంగా గత కొన్ని వారాలుగా రెస్ట్ తీసుకుంటోంది. ఈ అక్టోబర్ నుంచి మళ్ళీ కెమెరా ముందుకు రాబోతోంది.

రష్మిక మందన్న ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో చాలా బిజీగా ఉంది. మైసా మూవీలో గిరిజన యువతిగా ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుకున్నట్టు గనక పూర్తైతే, ఈ దసరా బరిలో రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, రష్మిక రెస్ట్ తీసుకుంటున్న నేపథ్యంలో వాయిదా పడింది. దాంతో అధికారికంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారో మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.

కానీ, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో చేస్తున్న రణబాలి మాత్రం దసరా బరిలోనే దిగబోతుంది. అక్టోబర్ 16న ఈ సినిమాను 5 భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండపై కీలక సన్నివేశాలు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో తిరిగి రణబాలి సెట్స్‌లో జాయిన్ కావడానికి రష్మిక ఓకే చెప్పింది. ఇదే, సందర్భంగా రెస్ట్ లో ఉన్నన్ని రోజులు హాలిడేస్‌ని బాగా ఎంజాయ్ చేసినట్టుగా తెలిపింది.

రణబాలి షూటింగ్ పూర్తి కాగానే, మైసా సెట్స్‌కి షిఫ్ట్ కానుంది. అలాగే, అట్లీ-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న రాకా మూవీ షూటింగ్‌లోనూ జాయిన్ అవనుంది. వీటి, తర్వాత అనిమల్ పార్క్ కోసం రెడీ అవుతుంది. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ పూర్తి చేసి ఆ వెంటనే అనిమల్ పార్క్ ను పట్టాలెక్కించనున్నాడు. ఈ రకంగా రానున్న మూడేళ్ళు రష్మిక మందన్న చాలా బిజీగా ఉండబోతోంది.

#Rashmika Mandanna#Ranabaali#Vijay Devarakonda#Mysa
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి