Tamannaah Bhatia: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌లో మిల్కీ బ్యూటీ తమన్నాకి ఇంకా క్రేజ్ ఉందనే చెప్పాలి. లేదంటే హీరోయిన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లో అవకాశాలు రాకపోయినా బడా హీరోల పక్కన ఐటం సాంగ్స్ మాత్రం చేస్తూ వేడి పుట్టిస్తోంది. అయితే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో తాజాగా వినిపిస్తున్నదాని ప్రకారం తమన్నా ఐటం సాంగ్ కోసం భారీగా డిమాండ్ చేయడం వల్ల ఆ అవకాశాలు కూడా చేజారిపోతున్నాయట.
తెలుగులో తమన్నా నటించిన మొదటి సినిమా శ్రీ. మంచు మనోజ్ హీరోగా నటించాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. అయినా, క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన హ్యాపీడేస్ సినిమాలో మేయిన్ హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుంది. వరుణ్ సందేష్‌కి జంటగా నటించిన తమన్నా, ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్‌తో అందరినీ బాగా ఆకట్టుకుంది. అంతేకాదు, బాక్సాఫీస్ వద్ద హ్యాపీడేస్ భారీ హిట్ కావడంతో స్టార్ హీరోల పక్కన వరుసగా అవకాశాలు అందుకుంది.
అలా, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ తమన్నా రొమాన్స్ చేసింది. ఒకదశలో తమన్నా అందుకున్న రెమ్యునరేషన్ సౌత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 5 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకున్న స్థాయికి వచ్చింది. అప్పట్లో అంత రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా తమన్నా పేరే వినిపించింది. అయినా, కూడా వరుసగా హిట్స్ రావడంతో దర్శక నిర్మాతలే కాదు, హీరోలు కూడా తమన్నా కావాలనే అడిగారు.
ఆ క్రేజ్ అలా ఉన్నప్పుడే ఐటం సాంగ్స్ కూడా చేస్తూ వచ్చింది. నోరా ఫతేహి, కత్రీనాల తర్వాత అంతకు మించిన ఐటం సాంగ్స్ కి తమన్నానే ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. దాంతో, ఒక్కో సాంగ్ కోసం తమన్నా 2 నుంచి 3 కోట్ల వరకూ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. డాంగ్ డాంగ్, స్వింగ్ జరా, అచ్చచో, కావాలయ్య, ఆజ్ కి రాత్.. లాంటి సాంగ్స్‌తో తమన్నా ఓ ఊపు ఊపేసింది.
జైలర్ లో చేసిన కావలయ్యా సాంగ్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాగే, ఆజ్ కి రాత్ అనే సాంగ్ కూడా. అదే, క్రేజ్ కంటిన్యూ చెయ్యాలనుకుంది మిల్కీ బ్యూటీ. కానీ, తన రెమ్యునరేషన్ ఎక్కువని మేకర్స్ సైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంతోనే జైలర్ 2లో ఉన్న స్పెషల్ నంబర్ కి పూర్ణా ని తీసుకున్నారు మేకర్స్. మరి, తమన్నా నెక్స్ట్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.










