క్రీడలు

Cm Revanth: మెస్సీ రిటైర్మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్టు.. రేర్ ఫొటో

రచన: NK3 నిమిషాల పఠనం

Cm Revanth: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. దాంతోపాటు మెస్సీతో తాను కలుసున్న అరుదైన ఫొటోను షేర్ శారు రేవంత్ రెడ్డి.

ప్రియమైన మెస్సీ అంటూ తన సందేశాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఎంతగానో ఉత్తేజపరిచారు, మీ అద్భుతమైన ఆటతీరుతో మమ్మల్ని అలరించారు అని మెస్సీని ప్రశంసించారు. మీరు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కితాబిచ్చారు. హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ గ్రౌండ్ లో మీతో కాసేపు గడిపిన క్షణాలను గొప్ప గౌరవంగా భావిస్తున్నా అని రేవంత్ పేర్కొన్నారు. ఏది ఏమైనా మెస్సీ లేని ఫుట్‌బాల్ మునుపటిలా ఉండదని కాస్త ఎమోషనల్ అయ్యారు. మీకు ఇదే మా వీడ్కోలు, మీ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి అని తన పోస్టులో ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఈ మేసేజ్ తో పాటు మెస్సీ తన రిటైర్మెంట్‌పై చేసిన పోస్టును కూడా రేవంత్ రెడ్డి షేర్ చేశారు. గతంలో హైదరాబాద్‌లోని ఫుట్ బాల్ స్టేడియంలో మెస్సీతో కలిసున్న రేర్ పిక్ ను కూడా జత చేసి.. మెస్పీపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

#Cm Revanth#Lionel Messi#Retirement#International football#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి