Trisha Krshnan: త్రిష కృష్ణన్ తెలుగులో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాతో మళ్ళీ తెలుగులో వరుసగా అవకాశాలు అందుకోవాలని ఆశపడింది. కానీ, ఆమె ఆశలన్నీ అలానే ఉండిపోయాయి. 2025 లో తమిళంలో చేసిన విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. అదే సంవత్సరం మెగాస్టార్ తో కలిసి నటించిన విశ్వంభర సినిమా రిలీజ్ కావాల్సింది.
అయితే, వీఎఫెక్స్ కారణంగా 2025లో రిలీజ్ కావాల్సిన విశ్వంభర ఈ ఏడాది రిలీజ్ అవుతుందని వార్తలైతే వస్తున్నాయి గానీ, అది ఎప్పుడూ అనేది మాత్రం మేకర్స్ నుంచి క్లారిటీ రావడం లేదు. సమ్మర్ కానుకగా రిలీజ్ అని ప్రచారం జరిగింది. కానీ, అది జరగలేదు. సమ్మర్ తప్పిదే దసరా బరిలో దింపాలనుకున్నారు. కానీ, ఇంకా..ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తి కాలేదు.
కాబట్టి, అక్టోబర్ 16న రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ మళ్ళీ డిసెంబర్ నెలకి పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తోంది. కొంత షూట్ మళ్ళీ చేయాల్సి రావడంతో చిరు 4 రోజులు డేట్స్ కూడా ఇచ్చినట్టుగా మొన్నామధ్య వార్తలు వచ్చాయి. త్రిష మాత్రం విశ్వంభర మూవీ రిలీజై బ్లాక్ బస్టర్ సాధిస్తే, మళ్ళీ టాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తాయని ఆశపడుతుంది. ఇంతకముందు ఆమె చిరంజీవితో చేసిన స్టాలిన్ ఫ్లాప్ సినిమాగా మిగిలింది.
ఈసారి మాత్రం గ్యారెంటీగా మెగాస్టార్‌తో చేస్తున్న విశ్వంభరతో హిట్ కొట్టాలనుకుంది. కానీ, త్రిష భావిస్తున్న హిట్ దక్కుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. టాలీవుడ్‌లో దాదాపు అందరి సరసన నటించిన త్రిష భారీ హిట్సే అందుకుంది. ఒకదశలో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంది. డేట్స్ సర్దుబాటు కూడా చేయలేనంత బిజీగా గడిపింది. మళ్ళీ, అలాంటి జోరు చూపించాలని కలలు కంటున్న త్రిష నిజమవుతాయో లేదో విశ్వంభర రిలీజయ్యాకే తెలుస్తుంది.










