తెలంగాణ

TG : ఆలంపూర్‌లో కేంద్రమంత్రి ప్రత్యేక పూజలు

రచన: Kumar4 నిమిషాల పఠనం

కేంద్ర బొగ్గు,గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఆలంపూర్‌లోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.ఆదివారం రాత్రి హరిత హోటల్లో బస చేసిన కేంద్రమంత్రి ఉదయం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి మొదట బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో, మేళతాళాలతో ముఖ్య అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు.

స్వేచ్ఛ న్యూస్, గద్వాల :

కేంద్ర బొగ్గు,గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఆలంపూర్‌లోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.ఆదివారం రాత్రి హరిత హోటల్లో బస చేసిన కేంద్రమంత్రి ఉదయం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి మొదట బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో, మేళతాళాలతో ముఖ్య అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. మొదట వినాయకుని పూజల్లో పాల్గొన్న అతిథులు..ఆ తర్వాత స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించారు.

అనంతరం సమీపంలోని జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాల్లో కేంద్ర మంత్రి ఇతర అతిథులతో కలిసి మొక్కను నాటారు. ఆలయ అధికారులు, పూజారులు అతిథులకు స్వామి,అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆ తర్వాత ఆలయ అధికారులు క్షేత్ర విశిష్టతను అతిథులకు వివరించారు.

ఆలయం నుంచి తిరిగి హరిత హోటల్‌కు చేరుకున్న అతిథులకు జిల్లాకు చెందిన పలు రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నేతలు, పలువురు రైతులు, ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అక్కడి నుంచి జోగులాంబ రైల్వే స్టేషన్‌కు బయలుదేరే ముందు మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ గౌతమి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ శ్రీనివాసరాజు, ఈవో పురంధర్, అదనపు కలెక్టర్ మధుమోహన్, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీవో శ్రీనివాసరావు, భాజపా రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు నేతలు, తదితరులు పాల్గొన్నారు.

#kishan reddy#dk aruna#Alampur visit#politics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి