క్రైమ్

Crime : ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో మైనర్‌పై గ్యాంగ్ రేప్

రచన: Kumar4 నిమిషాల పఠనం

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది.నిత్యం పోలీసుల పహారా, చెక్ పోస్టులు ఉండే ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. ఈ ఘటన ఆగస్టు 4 తేదీన చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా, ఈ దారుణ ఘటనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది.నిత్యం పోలీసుల పహారా, చెక్ పోస్టులు ఉండే ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. ఈ ఘటన ఆగస్టు 4 తేదీన చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా, ఈ దారుణ ఘటనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దేశరాజధానిలో అమ్మాయిలకు భద్రత కరువైందని, మైనర్లకు రక్షణ కల్పించడంలో మోడీ సర్కార్ ఫెయిల్ అయ్యిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

వివరాల్లోకివెళితే..ఉత్తరప్రదేశ్ మైన్‌పురి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని(16) తన కుటుంబ సభ్యులతో గొడవ పడి రాత్రి సమయంలో నోయిడాలోని బంధువుల ఇంటికి బయల్దేరింది.గ్రేటర్ నోయిడాలోని పరిచౌక్ వద్ద ఢిల్లీ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సు ఎక్కగా.. అందులో ఆ బాలిక తప్ప మరెవ్వరూ లేకపోవడంతో డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు.

పరిచౌక్ నుంచి ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వరకు 45 నిమిషాల పాటు రోడ్డుపై బస్సును తిప్పుతూ నిందితులు అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. అనంతరం బాలికను కశ్మీరీ గేట్ బస్ స్టాండ్ వద్ద దింపి నిందితులు పరారయ్యారు. బాధితురాలు కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన ఖాకీలు.. డ్రైవర్, క్లీనర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఆగస్టు 4వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.

https://x.com/pulsenewsbreak/status/2094304758538653998?s=20

ఈ విషయం ఇన్నిరోజులు బయటకు ఎందుకు రాలేదని, ఢిల్లీలోని బీజేపీ సర్కార్ కావాలనే ఈ దారుణాన్ని తొక్కిపెట్టిందని ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలాఉండగా, 2012లో డిసెంబర్ 16న రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో లోకల్ బస్సులో వెళ్తున్న నిర్భయ (పేరు మార్చబడినది)ఆమె స్నేహితుడిని మీద దాడి చేసిన నలుగురు దుండగులు.. అబ్బాయిని బయటకు తోసేసి అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేయడంతో పాటు చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 29 డిసెంబర్‌ 2012లో మరణించగా..ఈ కేసులో నిందితులకు కోర్టు ఉరిశిక్ష విధించింది.

#Gangrape#minor#delhi#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి