Tollywood: ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమా అనేది మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇన్ని వందల కోట్లు ఖర్చు చేస్తుంది ఎవరి కోసం..ఎందుకోసం. 5 కోట్ల లోపు సినిమాలు కూడా అవాక్కయ్యే వసూళ్ళను రాబడుతున్నాయి. కానీ, పాన్ ఇండియా సినిమా అందులోనూ మైథలాజికల్ సినిమాలకి మాత్రం కనీసం థియేటర్స్ రెంట్ కూడా రావడం లేదు. దీనికి, కారణం అతుకుల బొంతలా ఉంటోన్న వీఎఫ్ఎక్స్.
హాలీవుడ్ సినిమాల మాదిరిగా భారీ బడ్జెట్, గొప్పగా అనిపించే సెట్స్..వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోలు.. వీటిన్నటిపై ప్రేక్షకుల్లో ఉంటోన్న భారీ అంచనాలు. కానీ, ఆ అంచనాలకు తగ్గట్టుగా మాత్రం సినిమా ఉండటం లేదు. ముఖ్యంగా, కొన్ని మైథలాజికల్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతున్నాయి. దీనికి కథ, కథనం మాత్రమే కాదు..వాటికి బలంగా నిలిచే వీఎఫ్ఎక్స్ కూడా ఒక ప్రధాన కారణంగా మారుతోంది.
వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా కూడా గ్రాఫిక్స్ ప్రేక్షకులను మెప్పించలేకపోవడం, దాంతో, బాక్సాఫీస్ వద్ద ఊహించని రికార్డ్స్ నమోదవుతాయనుకున్న ఈ సినిమాలకు అదే అసలు మైనస్ అవుతోంది. ప్రస్తుతం, ఇదే విషయంలో సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మైథలాజికల్ సినిమాలు ఎందుకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి..? చిన్న బడ్జెట్ చిత్రాలు ఎలా కోట్లు వసూళ్ళు చేస్తున్నాయి.? దీనికి, సమాధానం గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్.
"హరిహర వీరమల్లు":
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా చూస్తే పిచ్చెక్కాల్సిందే. అంత దారుణంగా వీఎఫ్ఎక్స్ ఉంటాయి. సినిమాలో ప్రధానమైన అంశం వీఎఫ్ఎక్స్. కానీ, పవన్ లేకుండా డూప్ తో కొన్ని సీన్స్, వీఎఫ్ఎక్స్ తో కొన్ని సీన్స్ తీసి రిలీజ్ చేస్తే.. కామన్ ఆడియన్కి కూడా సినిమా నచ్చలేదు.
ప్రభాస్ "ఆదిపురుష్":
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమా రిలీజ్ కి ముందు మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ, ట్రైలర్ చూసిన అందరూ నిరాశపడింది వీఎఫ్ఎక్స్ బాగోలేదని. ఆదిపురుష్ రిలీజైయ్యాక కూడా ఇదే మైనస్ అయి సినిమా డిజాస్టర్ అయింది.
రామాయణకి వీఎఫ్ఎక్స్ మైనస్:
త్వరలో రాబోతున్న రామాయణ సినిమాకి వీఎఫ్ఎక్స్ మైనస్ కాబోతోంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీపావళి సందర్భంగా రిలీజ్ కాబోతున్న రామాయణ నుంచి ట్రైలర్ రాగా చాలా వీక్ వీఎఫ్ఎక్స్ అని తేలిపోయింది. ఎందుకు, ఇన్ని వందల కోట్లు పెట్టి ఖర్చు చేస్తున్నా వీఎఫ్ఎక్స్ సెట్ అవడం లేదు. ఆ బడ్జెట్ ఏమవుతోంది? ఎందుకు, క్వాలిటీ తగ్గుతోంది..? ఇప్పుడు ప్రశ్నలన్నీ రామాయణ ట్రైలర్ చూశాకా తలెత్తాయి. ట్రైలరే ఆకట్టుకోకపోతే, సినిమా ఇంకెలా ఆకట్టుకుంది..అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. ఇతిహాసాల జోలికి వెళ్ళి అనసరంగా డబ్బు ఖచు చేస్తున్నారని మాత్రం అనక తప్పదు.


