వైరల్ న్యూస్

‘సింగరేణి పోతే ఆ మాత్రం ఉండాలి’.. కొత్త లుక్‌పై కేటీఆర్ చమత్కారం!

రచన: Mamatha puppala•••3 నిమిషాల పఠనం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తన సరికొత్త లుక్‌తో రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తించారు. సాధారణంగా క్లీన్ షేవ్, ప్రొఫెషనల్ ఫార్మల్ ఆహార్యంలో కనిపించే ఆయన.. ఈసారి గడ్డం పెంచి సరికొత్త 'మాస్ లుక్'లో దర్శనమివ్వడం బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.

 రామగుండంలో నిర్వహించనున్న 'సింగరేణి కార్మిక గర్జన' సభకు బయల్దేరిన సమయంలో ఆయన ఈ కొత్త అవతారంలో కనిపించడంతో ఫొటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్‌గా మారాయి. హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్తున్న మార్గమధ్యంలో కరీంనగర్ వద్ద మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సతీశ్ బాబు తదితర సీనియర్ నాయకులు కేటీఆర్‌ను కలిశారు.

‘సింగరేణి పోతే ఆ మాత్రం ఉండాలి’.. కొత్త లుక్‌పై కేటీఆర్ చమత్కారం!

 ఈ సందర్భంగా ఆయన గడ్డం లుక్ చూసి ఆశ్చర్యపోయిన గంగుల కమలాకర్.. ‘ఏందీ సంగతి.. గడ్డం పెంచినవ్?’ అని సరదాగా ప్రశ్నించారు. దానికి కేటీఆర్ నవ్వుతూ.. ‘పోయేది గోదావరిఖనికే కదా.. సింగరేణికే కదా! ఆ మాత్రం ఉండాలే.. లేకపోతే నడవదు’ అని తనదైన శైలిలో చమత్కరించారు. కార్మిక క్షేత్రమైన సింగరేణి పర్యటనకు సరిపోయేలా మాస్ వైబ్‌తో సిద్ధమయ్యానని చెప్పడంతో నాయకులంతా నవ్వులు పూయించారు.

 కేటీఆర్ తాజా లుక్‌పై సోషల్ మీడియా వేదికల్లో బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు జోరుగా పోస్టులు పెడుతున్నారు. ‘బాస్ ఈజ్ బ్యాక్ విత్ ఏ మాస్ లుక్’ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు తమ ఆహార్యాన్ని మార్చడానికి అంతగా ఆసక్తి చూపరు, కానీ కేటీఆర్ ఇలా ట్రెండీగా లుక్ మార్చి దానికి సింగరేణి పర్యటనను ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

#KTRNewLook#KTRBeardLook#SingareniKarmikaGarjana#BRSTelangana#KTRMassLook#TelanganaPolitics2026#KTRViralVideo
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి