తెలంగాణ

TG : బీ అలర్ట్.. నేటి నుంచి రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతంలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయని, దీంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వాతావరణంలో చోటుచేసుకున్న ఈ మార్పుల దృష్ట్యా ప్రజలు, రైతాంగం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ, తూర్పు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటతో పాటు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోనూ ఆకాశం మేఘావృతమై ఉండి, సాయంత్రం, రాత్రి వేళల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈదురు గాలుల తీవ్రత వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడే ప్రమాదం ఉన్నదని తెలుస్తోంది. అందుకే వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద లేదా పాత భవనాల సమీపంలో ఆశ్రయం పొందవద్దని విపత్తు నిర్వహణ విభాగం సైతం హెచ్చరికలు జారీ చేసింది.

ఇదిలాఉండగా, రాష్ట్రంలో ఎల్ నిన్ ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. జలశయాల్లో అనుకున్నంత మేర నీటి నిల్వ లేకపోవడంతో సాగుకు నీరు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు ఎండిపోతుండటంతో సాగుకు నీరు ఇవ్వాలని రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు.మరోవైపు కరువు కొరలు చాస్తుండటంతో మున్ముందు తాగునీటికి కూడా ఇబ్బందులు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

#Rains#telangana#hyderabad#mansoon#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి