పడకేస్తున్న పాలనపై మేల్కొంటున్న రేవంత్ ప్రభుత్వం
మీ అనుచరుల అరాచకాలపై ఏం చేద్దాం సీఎం గారు?
వాళ్ల బీభత్సాన్ని కంట్రోల్ చేయకపోతే.. మీకు అడ్మిస్ట్రేషన్పై పట్టు లేదనేదే నిజం?
ఎల్ నినోపై మూడు రోజుల క్రితం అప్రమత్తం అయితే వేరేలా ఉండేది?
నేటి మంత్రివర్గ సమావేశంతో మరో 10 రోజులు వెనక్కి పోయినట్లే?
కరెంట్‌పై ఫాలో అప్ చేయలేదు.. నీళ్లపై సమీక్షలకు ఆదేశించలేదు?
వ్యవస్థను చేతిలో పెట్టుకుని ఇక నుంచి ప్రతిపక్షాలపై మభ్యపెట్టే మాటలు సాగవు?
ఓటు బ్యాంకు కోసం బ్యాక్ ఎండ్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు?
మీ అనుంగ అనుచరులపైనైనా ఫోకస్ చేసి కంట్రోల్ చేసుకోండి?
ఎన్నో ఏండ్లుగా వివాదంలో ఉన్న భూములను కబ్జా చేస్తున్నారు
వాళ్ల సంపద వందల కోట్లలో ఉంటోంది.. మీ గ్యాంగు సంపాదించుకున్నది చాలు?
ఇకనైనా ఆపమనండి.. కొంతైనా మీ కోసం పని చేయమనండి?
బాస్ పేరు అంటూ అరాచకాలపై ఆధారాలు లేకపోతే.. స్వేచ్ఛ న్యూస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల ఇస్తారు
ఇకనైనా సిస్టమ్‌ని సెట్ చేసుకోండి రేవంత్
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809.
ప్రజల మేలు కోరే నాయకుడే ముఖ్యమంత్రి కావాలని వందల మంది నాయకులున్నా ఏరికోరి ఒక్కరినే సీఎం కావాలని కోరుకుంటారు. వాళ్ల కోసం వందల మంది క్లోజ్‌గా పని చేస్తారు. వేల మంది మేలు కోరుతారు. లక్షల మంది ఆయన కోసం ఓట్లు వేస్తారు. మిగతా కోట్ల మంది వివిధ న్యాయకత్వంతో ఓట్లు వేసి పాలించే అదృష్టం కల్పిస్తారు. ఇలాంటి గొప్ప ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డికి 40 శాతం మార్కులు కూడా లేకుండానే 75 శాతంతో డిస్టెన్స్‌లో పాస్ చేశారు తెలంగాణ ప్రజలు. కానీ, దాన్నికాపాడుకోవడంలో ఒక్కొక్క విధంగా ఫెయిల్ అవుతున్నారు. రాజకీయ చదరంగలో ఎత్తులు వేయగలరు. కానీ, పాలనలో అనుచరుల వ్యవహారంతో పలచన అవుతున్నారు. కంట్రోల్ లేని అడ్మినిస్ట్రేషన్‌తో అభాసుపాలు అవుతున్నారు. ఆనాడు కేసీఆర్ అహంకారం అయితే, ఈనాడు రేవంత్ నమ్మిన వాళ్ల కోసం విచ్చలవిడి ఆదేశాలే కారణం.
అనుచరులపై కంట్రోల్ తెచ్చుకోండి
మీకు పీఏగా పని చేయొచ్చు. లేదా మీ కాళ్లకు బూట్లు తొడగొచ్చు. మీకు రోజు ప్రెస్ నోట్ రాసి ఇవ్వొచ్చు. మీతో కారులో తిరగొచ్చు. మీకు వంట చేసి పెట్టొచ్చు. మీకు తోడబుట్టోచ్చు. మీ లైఫ్ భాగస్వామి కావచ్చు. మీ రక్తాన్ని పంచుక పుట్టిన వారైనా సరే.. మీరు సీఎంగా ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోంచించుకోవాలి. సీఎం కావాలనే ఆశయం ఎలా ఉంటుందో, వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో వాటన్నింటిపై కంట్రోల్ లేకుండా సంపాదనే అన్నింటికి అంటే అందరూ జైల్లో క్యూ కట్టేలా ప్రజలు దీవిస్తారు. అవకాశాన్ని బతికితే చాలు అనుకున్నట్లు చేసుకుంటే మరోసారి వెయ్యి అవకాశాలు వస్తాయి. ఒకేసారి అన్ని చేసుకుంటాం అంటే ఇలానే రోజుకో వార్త, రోజుకో స్కాం బయట పడుతుంటాయి. చీ నీ బతుకు అన్నట్లు ప్రజలు చీదరించుకుంటారు.
మీ అనుచరులు మీ పేరు చెప్పి చేసుకుంటున్న దందా చిట్టా ఉంది?
ఇన్నాళ్లు చర్యలు తీసుకోకండి డబ్బులు ఇస్తాం అంటూ వచ్చి కోట్లు కుమ్మరించారు. లక్షల స్క్వేర్ ఫీట్లు మీ అనుచరులకు సమర్పించిన రోజులు చూశాం. పత్రి ప్రాజెక్ట్‌లో ఆధారాలు ఉన్నాయి. వాళ్లు చేసిన దందాలు అధికారుల వద్ద దాగిన ఫైల్స్ వేల కోట్ల విలువైనవి. ఈ రోజుతో ముగిసిపోయే దందాలు కావు. కానీ, అధికారాన్ని మొత్తం కూడగట్టుకొని తప్పులు చేస్తున్నారు. పోలీసుల వ్యవస్థ, రవెన్యూ సిస్టమ్‌ని పాడు చేస్తున్నారు. మీ వద్ద ఉన్న 100 మంది ఏం చేశారో లిస్ట్ ఇస్తాం. మీరే ఎంక్సైరీ చేసుకోండి. ఎల్ నినో లేకపోతే మిమ్మల్ని ఎవరూ అడగకపోవు. కానీ, ప్రజలకు మేలు చేస్తామనే పేరుతో మీ మంత్రులతో పాటు అనేక మంది మీ అనుచరులు చేస్తున్న దందాలు ఎన్నో? ఒకసారి చూసుకోండి.


