తెలంగాణ

HYD : రోగులకు నిమ్స్ శుభవార్త.. ఓపీ సేవల సమయం పెంపు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చే రోగులకు ‘నిమ్స్’ హాస్పిటల్ శుభవార్త చెప్పింది. ఓపీ(ఔట్ పేషెంట్) సేవల సమయం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిమ్స్‌లో అత్యవసర చికిత్సలకు మినహాయించి సాధారణ హెల్త్ చెకప్, అనారోగ్య సమస్యలకు ట్రీట్మెంట్ కోసం వెళ్లే రోగులు తప్పకుండా ఓపీ తీసుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చే రోగులకు ‘నిమ్స్’ హాస్పిటల్ శుభవార్త చెప్పింది. ఓపీ(ఔట్ పేషెంట్) సేవల సమయం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిమ్స్‌లో అత్యవసర చికిత్సలకు మినహాయించి సాధారణ హెల్త్ చెకప్, అనారోగ్య సమస్యలకు ట్రీట్మెంట్ కోసం వెళ్లే రోగులు తప్పకుండా ఓపీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఉదయం 8 గంటల నుంచి కేవలం 11 గంటల వరకే ఓపీ సేవలు మొన్నటివరకు కొనసాగాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చేది.

తమ బంధువులు, కుటుంబాల కోసం రాత్రిళ్లు వచ్చి ఆస్పత్రి లేదా హోటల్స్‌లో బస చేసి ఉదయాన్నే ఓపీ తీసుకుని హెల్త్ చెకప్, ట్రీట్మెంట్ తీసుకుని వెళ్లేవారు. ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని రోగులు, వారి తరపు బంధువులు ఆవేదన వ్యక్తం చేసిన రోజులు ఉన్నాయి. ఒకసారి ఆస్పత్రి ప్రాంగణంలో చూస్తే అక్కడే చెట్ల కింద, క్యాంటీన్ వద్ద ఖాళీ ప్రదేశంలో రెండు, మూడు రోజుల నుంచి అక్కడే తినడం, పడుకోవడం చేస్తూ తమ సమయం కోసం ఎదురుచూసే పేషెంట్ తరఫు బంధువులు కనిపిస్తుంటారు.

ఈ క్రమంలోనే నిమ్స్‌కు వచ్చే రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ఆదేశించింది. గతంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకే రిజిస్ట్రేషన్లు కొనసాగగా.. ఇప్పుడు దానిని మధ్యాహ్నం 2 గంటల వరకు పొడగించారు. ఈ నిర్ణయంతో దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ప్రయోజనం కలుగనుంది.

ఎంఆర్‌ఐ స్కానింగ్ మినహా ఇతర వైద్య పరీక్షలు అదే రోజు నిర్వహించేలా మేనెజ్మెంట్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.పరీక్షల నివేదికలు ఒకటి రెండు గంటల్లోనే అందేలా చర్యలు తీసుకోనున్నారు. అదే రోజు వైద్యులను సంప్రదించి చికిత్స పొందే అవకాశాన్ని కూడా కల్పించారు. కాగా, ఇక మీదట నుంచి సాయంత్రం వరకు వైద్యులు అందుబాటులో ఉండనున్నారు. ఈ నిర్ణయం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఉపశమనం కల్గించనుంది.

#NIMS#punjagutta#hyderabad#Op service#time extension#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి