Jailer 2 Review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ 2. గతంలో వచ్చిన జైలర్ సినిమాకి సీక్వెల్ కావడంతో సహజంగానే సీక్వెల్ మూవీపై అంచనాలు రెట్టింపు స్థాయిలో పెరగడం సహజం. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 చిత్రాన్ని రూపొందించాడు. అక్టోబర్ 15న రిలీజైన ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది.
జైలర్ 2లో నెల్సన్ దిలీప్‌కుమార్ మరోసారి రజినీకాంత్‌ను టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో అద్భుతంగా చూపించారు. పార్ట్ 1 లాగానే ఈసారి కూడా తలైవా తన స్టైల్, స్వాగ్తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. వర్మ విగ్రహాల స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అతనితో ముత్తువేల్ కొడుకు కూడా చేతులు కలుపుతాడు. వీరిద్దరిని చంపి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు ముత్తువేల్ పాండ్యన్. ఆ తర్వాత విలిలన్కే దగ్గరై తన మార్క్ మాస్ అండ్ యాక్షన్ తో ఒకవైపు తన కుటుంబాన్ని కాపాడుకుంటూనే, విగ్రహాల స్మగ్లింగ్ ముఠాను ఎలా పట్టుకున్నాడు..అన్నదే మిగతా కథ.
ఇప్పటికే, జైలర్ లో రజనీ మాస్ పర్ఫార్మెన్స్ చూసేశాము కాబట్టి, ప్రత్యేకంగా ఆయన నటన గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఒకరకంగా యాక్షన్ సీక్వెన్సెస్‌లో రజినీ విశ్వరూపాన్ని చూడొచ్చు. గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన హృతిక్ రోషన్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, మోహన్ లాల్ వారి పాత్రలకి తగ్గట్టుగా అద్భుతంగా నటించారు. ఎప్పటి లాగానే రమ్యకృష్ణ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. క్లైమాక్స్‌లో విజయ్ సేతుపతి ఎంట్రీ అదిరిపోయింది. అలాగే, ఈ సినిమాకి పార్ట్ 3 ఉందని లీడ్ ఇవ్వడం ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ అని చెప్పాలి.
మొత్తానికి, నెల్సన్ దిలీప్ కుమార్ రజినీకాంత్ అభిమానులు ఏం కోరుకుంటారో అందుకు తగ్గట్టే, మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా చూపించాడు. నెల్సన్ కథ, కథనాలకి, రజినీ మాస్ అపీరియన్స్కి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్లో నిలబెట్టింది. ఫైనల్‌గా చెప్పాలంటే అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్లో ఉన్న రజినీ అభిమానులను మాత్రం డిసప్పాయింట్ చేయదు. ఈ దసరా హాలీడేస్‌కి ఫ్యాన్స్‌కి మంచి ఎంటర్టైనర్ ఇచ్చాడు నెల్సన్. మరి, ఒక్కరోజు తేడాతో విజయ్ దేవరకొండ నటించిన రణబాలి జైలర్ 2కి ఏ రేంజ్లో పోటీ ఇస్తుందో చూడాలి.


