తెలంగాణ

సీఎం హెచ్చరికతో కదలిక.. యాదాద్రి ప్లాంట్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీలు!

రచన: Mamatha puppala•••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న అప్రకటిత విద్యుత్ కోతలు, సరఫరా సమస్యలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో విద్యుత్ శాఖ అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆయన, పరిస్థితిలో తక్షణ మార్పు రాకపోతే ఉన్నతాధికారులను సైతం సస్పెండ్ చేయడానికి వెనుకాడబోమని గట్టి హెచ్చరిక జారీ చేశారు.

 నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు అవసరమైన లింకేజీలు ఉన్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తిలో మందగమనం ఎందుకు ఉందో నిలదీస్తూ తక్షణ నివేదిక కోరారు. ముఖ్యమంత్రి హెచ్చరికలతో అలర్ట్ అయిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. TGGENCO సీఎండీ హరీష్ (IPS) గత రెండు రోజులుగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) వద్దే మకాం వేసి ఉత్పత్తి ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

 గురువారం(నేడు) ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్ (IAS) కూడా హుటాహుటిన వైటీపీఎస్‌కు చేరుకుని 4000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ యూనిట్ల పనితీరును, లోపాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. నగరానికి, రాష్ట్రానికి విద్యుత్ కొరత రాకుండా ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని ఆదేశించారు.

 ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో తలెత్తిన విద్యుత్ కోతలతో రైతులు, ప్రజలు తీవ్రంగా సతమతమవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు తాగునీటికి జనం, అటు సాగునీటికి రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు, తీసుకుంటున్న చర్యలతోనైనా తమ కష్టాలు గట్టెక్కుతాయని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి విద్యుత్ శాఖ అధికారులు తీసుకుంటున్న ఈ చర్యలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో వేచిచూడాల్సిందే.

#RevanthReddyPowerReview#TelanganaPowerCrisis#YTPSYadadriPowerPlant#NaveenMittalIAS#InvestTelangana2026#TelanganaNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి