సినిమా

Tollywood: స్టార్స్ డేట్స్ ఇవ్వడమే పొరపాటా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Tollywood: పాన్ ఇండియన్ స్టార్స్‌గా పాపులారిటీని తెచ్చుకోవాలంటే ఎన్నేళ్ళు కష్టపడాలో మన ప్రభాస్, ఎన్‌టిర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, యష్ లాంటి వారిని చూస్తే అర్థమవుతుంది. ఇట్టే గ్లోబల్ వైడ్‌గా ఈ హీరోలకి క్రేజ్ అండ్ మార్కెట్ పెరగలేదు. బాహుబలి లాంటి సినిమా కోసం ప్రభాస్ ఎంతగా శ్రమించాడో అందరికీ తెలిసిందే.

Tollywood: పాన్ ఇండియన్ స్టార్స్‌గా పాపులారిటీని తెచ్చుకోవాలంటే ఎన్నేళ్ళు కష్టపడాలో మన ప్రభాస్, ఎన్‌టిర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, యష్ లాంటి వారిని చూస్తే అర్థమవుతుంది. ఇట్టే గ్లోబల్ వైడ్‌గా ఈ హీరోలకి క్రేజ్ అండ్ మార్కెట్ పెరగలేదు. బాహుబలి లాంటి సినిమా కోసం ప్రభాస్ ఎంతగా శ్రమించాడో అందరికీ తెలిసిందే.

ఇక ఆర్ఆర్ఆర్ కోసం చరణ్, తారక్‌లు అంతే. కేజీఎఫ్ సిరీస్ కోసం యష్ పడిన కష్టాలు చాలామందికి తెలియదు. ఇక, పుష్ప సిరీస్‌తో పాన్ ఇండియన్ స్టార్ గా, ఐకాన్ స్టార్ గా పాపులారిటీ తెచ్చుకున్న అల్లు అర్జున్..ఈ సినిమా కోసం మేకోవర్, భాష-యాస, బాడీ లాంగ్వేజ్..ఇలా ప్రతీ విషయంలో చాలా కష్టపడ్డాడు. కాబట్టే, వీరందరికీ ఈ స్థాయిలో పాపులారిటీ వచ్చింది. కాంతార సినిమా కోసం రిషబ్ శెట్టి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్నాడు.

ఇలాంటి, హీరోలు అవకాశం వస్తే తీయాల్సిన సినిమాలు మాత్రం ఇవి కావు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, డబ్బులు పెట్టే నిర్మాతలు నిద్ర మాత్రలు వేసుకుంటే గానీ పడుకోలేని పరిస్థితి. డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి కూడా ఇంతే. ఇక, ఒక హీరోకి గ్లోబల్ రేంజ్‌లో సక్సెస్ వచ్చి ఆ తర్వాత భారీ డిజాస్టర్ వస్తే ఆ హీరో మార్కెట్ మొత్తం చెదిరిపోతుంది. ఇవన్నీ, మన దర్శకులకి ఎందుకు అర్థం కావడం లేదో.

మారుతికి ఛాన్స్ ఇవ్వకుండా ఇవ్వాల్సింది!

ప్రభాస్ సరదా కథ చేద్దాం ఉంటే చెప్పమని మారుతిని అడగటమే పెద్ద పొరపాటు. అసలు, ప్రభాస్ తో చేయాల్సిన సినిమానా అది. పైగా ఇంటి అడ్రస్ చెప్పడం. ఎందుకంత ఓవర్ కాన్‌ఫిడెన్స్. దీని, ప్రభావం నిర్మాతకి ఎంతగా పడుతుందో. ఇటీవల వచ్చిన యష్ టాక్సిక్ సినిమా గురించైతే మాట్లాడుకోవడం అనవసరం. నాలుగేళ్ళ శ్రమ. దాదాపు 600 కోట్ల బడ్జెట్..చివరికి తీసింది నాసిరకం బూతు సినిమా. గీతూ మోహన్‌దాస్ ని యష్ మరీ గుడ్డిగా నమ్మాడు. అంత అవసరం ఏముంది అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న.

ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేసిన బిగ్ మిస్టేక్స్:

రామ్ చరణ్ మరీ బోలాగా గేమ్ ఛేంజర్ సినిమాను ఒప్పుకోవడమే. శంకర్ కి మన నేటివిటీ తెలీదు..అర్థం కాదు. దిల్ రాజు ఎందుకు ఈ సినిమాను నిర్మించాడో ఆయనకే తెలియాలి. అసలు చరణ్ సైన్ చేయకుండా ఉండాల్సింది. దీని వల్ల దిల్ రాజుకి కోలుకోలేని దెబ్బ. చరణ్ ఇమేజ్ డ్యామేజ్. ఆ వేంటనే పెద్ది. బుచ్చిబాబు మంచి కథ తీస్తాడనుకుంటే అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. హీరోలకి తగ్గ కథలను తయారు చేయడమే ఇక్కడ సమస్య. దర్శకుల తప్పిదమే కనిపిస్తోంది. కాబట్టే, మన తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తక్కువ.

#Prabhas#Allu Arjun#NTR#Ram Charan#Yash
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి