Ravi Teja: మన టాలీవుడ్ హీరోలు చాలామంది తమ సినిమాలు గనక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ గురించి ఆలోచించి తీసుకున్న రెమ్యునరేషన్‌లో సగమో..కొంత పర్సెంటేజో తిరిగి ఇచ్చేస్తుంటారు. ఇలా, మన స్టార్ హీరోలు చాలామంది చేస్తున్నారు. అయితే, పూర్తిగా రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేసిన హీరో మాత్రం రవితేజ ఒక్కడే.
క్రాక్ తర్వాత కొన్ని ఫ్లాపులు, ధమాకా తర్వాత మళ్ళీ వరుస ఫ్లాపులు. దీంతో, రవితేజతో సినిమాలు చేసిన నిర్మాతలు చాలా నష్టపోయారు. ఇది, అందరికీ తెలిసిన విషయమే. ఒకదశలో రవితేజతో సినిమా చేయాలా వద్దా అనే సందిగ్ధంలో కూడా నిర్మాతలు పడ్డారు. 6 ఫ్లాపులొచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం తగ్గలేదు. అదే, సమయంలో రవితేజ తన రెమ్యునరేషన్ 25 కోట్ల వరకూ తీసుకున్నాడని ప్రచారం జరిగింది.
కానీ, ఆయన నటించిన సినిమాలు ఫ్లాపై కనీసం 10 నుంచి 12 కోట్ల వరకూ కూడా కలెక్షన్స్ రాలేదు. ఇది. నిర్మాతకి భారీ నష్టం. అయితే, భర్త మహాశయులకువిజ్ఞప్తి తర్వాత చేసిన ఇరుముడి సినిమాకి నిర్మాతలతో ఓ ఒప్పందం కుర్చుకున్నాడట. ఇరుముడి హిట్టైతేనే రెమ్యునరేషన్ తీసుకుంటానని..మీకు మంచి లాభాలు వస్తే అందులో కొంత వాటా ఇవ్వమని అడిగాడట.
దాని ప్రకారమే మైత్రీ వారితో రవితేజ ఇరుముడి సినిమాను చేశాడు. ఇప్పుడు సినిమా 150 కోట్ల వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో, ఎంత కాదన్న రవితేజ వాటా 50 కోట్లకి పైగానే వస్తుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు. ఓటీటీ, శాటిలైట్ అంతా కలుపుకుంటే రవితేజకి మంచి రెమ్యునరేషన్ అందుతుందని అంటున్నారు. దీంతో..ఇకపై రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేసి..ఆ సినిమా హిట్ సాధిస్తే లాభాలలో వాటా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇది, కలిసి వస్తే బాగానే ఉంటుంది.












