Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఈ రోజున పవన్ కళ్యాణ్ నటించబోతున్న కొత్త ప్రాజెక్ట్స్‌కి సంబందించిన సాలీడ్ అప్‌డేట్స్ ఉంటాయని ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ లవర్స్, ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ, తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఏమీ ఆశించకుండా ఉంటే మంచిదని తెలుస్తోంది. ఏ అప్‌డేట్స్ రావడం లేదని ఇన్‌సైడ్ టాక్.
నిరాశ తప్పదా?
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే.. దేశ వ్యాప్తంగా అభిమానుల హడావిడి..రెండు తెలుగు రాష్ట్రాలలో రక్త శిభిరాలు, అన్నదాన కార్యక్రమాలు..ఇలా చాలా ఉంటాయి. వీటన్నిటికంటే కూడా కొత్తగా కమిటైన సినిమా అప్‌డేట్స్ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే, అఫీషియల్‌గా రెండు సినిమాలను ప్రకటించి ఉన్నారు. కానీ, ఇప్పుడు తెలుస్తున్నదాని ప్రకారం ఏ అప్‌డేట్ ఉండబోదట.
ఆరోగ్య సమస్యే కారణమా?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాలలో చాలా బిజీ. ఇక, ఇటీవల సర్జరీ జరిగి కొంత రెస్ట్ కూడా తీసుకున్నారు. ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్యం కుదుటపడలేదట. వీటి కారణంగానే పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమాలను పట్టాలెక్కించడానికి సమయం పడుతుందని తెలుస్తోంది.
పవన్ రెడీ అంటే ముందు ఓజీ2!
ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక రెడీ అంటే పక్కా స్క్రిప్ట్‌తో ఎదురుచూస్తున్న దర్శకుడు సుజీత్ వెంటనే సెట్స్‌పైకి వచ్చేస్తాడు. ఇందులో, ఎలాంటి అనుమానాలు లేవు. కానీ, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ మాత్రం ఇంకా హోల్డ్‌లోనే ఉంది. ఇది, ఇప్పట్లో పట్టాలెక్కుతుందా? అంటే సందేహమే. ఇక, పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు కొత్త సినిమా కబుర్లేవీ ఉండవట. ఒకవేళ ఉంటే ఓజీ 2 నుంచి ఓ మోషన్ పోస్టర్..లేదా పవన్ లుక్ రావచ్చునని అంతకన్నా గొప్ప అప్‌డేట్ ఉండని ఇన్‌సైడ్ టాక్. ఇది, ఫ్యాన్స్‌కి పెద్ద డిసప్పాయింట్ అయ్యే అప్‌డేట్.












