సినిమా

The Paradise: ‘యెషనాగుల’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..నానీ-కీర్తి రెచ్చిపోయారు

రచన: Anshu4 నిమిషాల పఠనం

The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'ది ప్యారడైజ్'. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకముందు ఆయా షేర్ అనే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చి సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, సెకండ్ సింగిల్ ‘యెషనాగుల’ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

నాని మొదటిసారి ఓ వినూత్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో 'జడల్' అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవల వచ్చిన టీజర్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్ 24న ఈ సినిమా భారీ స్థాయిలో 8 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

'ది ప్యారడైజ్' సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సెకండ్ సాంగ్ ‘యెషనాగుల’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఉందని తెలిసినప్పటి నుంచి, అందులోనూ కీర్తి సురేష్ ఐటం సాంగ్ అన్నప్పటి నుంచి అందరిలోనూ ఆసక్తి రెట్టింపైంది. ఇక, తాజాగా వచ్చిన ఈ సాంగ్‌లో కీర్తి లుక్స్ బాగా ఆకట్టుకున్నాయి.

నాని, కీర్తిల ఊరమాస్ స్టెప్పులు మాస్ ఆడియన్స్‌తో గ్యారెంటీగా స్టెప్పులేయిస్తాయి. ఇందులో సందేహమే లేదు. గతంలో కీర్తి సురేష్, నాని కలిసి 'నేను లోకల్'..'దసరా' లాంటి సినిమాలు చేశారు. వీరి కాంబోకి మంచి క్రేజ్ ఉంది. కాబట్టి, ఈ డాన్స్ నంబర్‌పై ఆసక్తి బాగా ఉంది. అందుకు, తగ్గట్టే ఈ సాంగ్‌ను కంపోజ్ చేశారు ఆట సందీప్ మాస్టర్. మరి, సినిమా థియేటర్స్‌లోకి వచ్చాక ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక, ఈ సినిమాను ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

#yeshanagula Song#Nani#The Paradise#Keerthy uresh#Srikanth Odela#Kayadu Lohar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి