సినిమా

The Paradise: 35 సెకన్ల టీజర్‌లో ప్రపంచం కనిపిస్తుందా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

The Paradise: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడవబోయి హీరో అయిన వారిలో నాని కూడా ఒకడు. కెరీర్ ప్రారంభంలో మణిరత్నం వద్ద దర్శకత్వ శాఖలో పని చేస్తున్న నానికి ఇంద్రగంటి మోహనకృష్ణ తాను తీసిన అష్టా చమ్మా సినిమాలో ఓ హీరోగా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పక్కింటి కుర్రాడి పాత్రల్లో నటించి నేచురల్ స్టార్‌గా పాపులారిటీని సంపాదించుకున్నాడు.

అయితే, ఏ హీరోకైనా కావాల్సింది మాస్ ఇమేజ్..ఇప్పుడు అందరి దృష్టి ఉంది పాన్ ఇండియా స్టార్ అనే ముద్రపైన. అందుకోసమే నాని, వి..టక్ జగదీష్, సరిపోదా శనివారం, దసరా లాంటి కథలను ఎంచుకున్నాడు. మాస్ హీరోగా కూడా క్రేజ్ వచ్చింది. పాన్ ఇండియా స్టార్ అనే ఇమేజ్ కి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. దసరా సినిమాతో ఆ క్రేజ్ వచ్చినప్పటికీ, అది సరిపోలేదు.

అందుకే, అదే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇక, ఈ సినిమాలో నాని 'జడల్' అనే వెరైటీ పాత్రలో అలరించబోతున్నాడు. ఇప్పటికే, వచ్చిన 'ఆయా షేర్'.. సాంగ్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

అయితే, ఈ ఆగస్టు 6వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టుగా దర్శకుడు శ్రీకాంత్ తన ఎక్స్ ద్వారా తెలిపాడు. 35 సెకన్ల నిడివితో రాబోతున్న ఈ టీజర్ లో 'ది ప్యారడైజ్'.. ప్రపంచాన్ని జస్ట్ శాంపిల్ చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా కయాదు లోహర్ నటిస్తోంది. ఓ స్పెషల్ సాంగ్ కోసం కీర్తి సురేష్ ని తీసుకున్నారని తెలుస్తోంది. మరి, ఆగస్టు 6న వచ్చే టీజర్ తో చాలా క్లారిటీస్ వచ్చేస్తాయని సమాచారం.

#Nani#TheParadise#KayaduLohar#KeerthySuresh#SrikanthOdela
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి