Ramayana-Toxic: ఒకేసారి రెండు భారీ చిత్రాలు గనక బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అవుతున్నా..ఒకే వారం తేడాతో వస్తున్నా మన విశ్లేషకులు, అభిమానులు పోల్చుకోవడం సర్వ సాధారణం. ఇక, ట్రోలర్..నెగిటివ్ గా కామెంట్స్ చేసే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదో వంక పట్టుకొని అనవసరంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు.
ఇప్పుడు, కూడా అలాంటి..నెగిటివిటీ, తప్పుడు కంపేరిజన్ చేస్తున్నారని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అలా, కంపేర్ చేస్తున్న సినిమాలు మైథలాజికల్ మూవీ రామాయణ, యాక్షన్ అండ్ రొమాంటిక్ మూవీ టాక్సిక్. అసలు, ఈ రెండు జానర్స్ కి పోలిక, పొంతనే లేదు. కానీ, రక రకాలుగా మాట్లాడుతున్నారు. ఇటీవల రామాయణ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది.
అయితే, ఇది ఆశించిన స్థాయిలో లేదన్నది మాత్రం వాస్తవం. కొన్ని, కావాలనే హైడ్ చేశారా లేక పొరపాటు జరిగిందా తెలీదు గానీ, వాటి గురించే చర్చ సాగుతోంది. హనుమాన్ పాత్రను రివీల్ చేయకపోవడం, రామాయణ సినిమాలోను పాత్రలకి కూడా ట్రెండీ కాస్ట్యూంస్ ఉన్నాయనడం..సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి సూటవలేదనడం..ఒకటేమిటీ..చాలా నెగిటివ్ పాయింట్స్ ని లేవనెత్తుతున్నారు.
ఇదే, సమయంలో గీతూ మోహన్ దాస్ రూపొందిస్తున్న టాక్సిక్ సినిమా నుంచి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ తో కియారా అద్వానీ లాంటి వారి పాత్రల గురించి నెగిటివీ ప్రచారం చేస్తున్నా.. వస్తున్న పాజిటివ్ మాత్రం పీక్స్‌లో ఉంది. అంతేకాదు, ఇప్పుడు..రామాయణ ట్రైలర్ ఆసక్తికరంగా లేదు కాబట్టి, సినిమా కూడా ఊహించిన స్థాయిలో ఉండదని ఫిక్సై..టాక్సిక్ మూవీ కి హైప్ పెంచేలా మాట్లాడుతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కానీ, అభిమానులు దీన్ని ఒప్పుకోవడం లేదు. ఎంతమాత్రం ఈ రెండు జానర్ సినిమాలను కంపేర్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు. మరి, బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా ప్రభావం ఎలా ఉంటుందో..ఏది సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.












