సినిమా

Tollywood: ఒక్క రాజమౌళి మాత్రమే ఆ మాట చెప్పలేదు..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ రికార్డుల గురించే మాట్లాడే మేకర్స్ ఉన్నారు. సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడే దర్శకులున్నారు, అలాగే హీరోలూ ఉన్నారు. ఈసారి సంక్రాంతికి బద్దలైపోద్దంతే..అని ఒక దర్శకుడు చెప్తే, వాట్ లగాదేంగే..అని ఇంకో దర్శకుడు చెప్తాడు. ఈ సినిమా మా హీరో కెరీర్‌లో మైల్ స్టోన్ అని ఇంకో దర్శకుడు చెప్తే..ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బద్దలు కొడుతున్నాం.. అని ఇంకో ఫిల్మ్ మేకర్ అంటాడు.

ఇలా, పండుగ సీజన్ ని టార్గెట్ చేసుకొని బరిలో దిగే దర్శకులు అందరూ తమ సినిమా గురించి గొప్పగా చెప్పేసి ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేస్తున్నారు. కానీ, అలా చెప్పిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద తిరగబడ్డ రోజులూ ఉన్నాయి..సినిమాలు చాలానే ఉన్నాయి. కొందరు తమ కథ మీద నమ్మకంతో చెప్పిన మాటలు నిజమైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

అయితే, మన తెలుగు సినిమాను.. ఇండియన్ సినిమా అనేంత గొప్పగా హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కి ఏమాత్రం తీసిపోని హై టెక్నికల్ వ్యాల్యూస్ తో సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఒక్క రాజమౌళి మాత్రం ఇప్పటి వరకూ ఆ మాట చెప్పలేదు. సినిమా గురించి, కథ గురించి.. కథలో తన హీరోల పాత్రల గురించే ఏ ఈవెంట్ లోనైనా మాట్లాడాడు గానీ, ఈ రికార్డ్స్ మావి..ఇన్ని రికార్డ్స్ బద్దలు కొడుతున్నాము..అంటూ గొప్పలు పోయింది లేదు.

అందుకే, ఈ రోజు దర్శక ధీరుడిగా మనకి ఆస్కార్ అవార్డులను తెచ్చిపెట్టాడు. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో మన స్థాయి ఇదీ.. అని అన్నీ ప్రపంచదేశాలకి చాటి చెప్పాడు. ఇప్పుడు, అన్నీ దేశాల చూపు 'వారణాసి' సినిమా మీదే ఉంది. దాదాపు 1400 కోట్ల రూపాయలతో సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, విలక్షణ నటుడు పృథ్వి రాజ్ సుకుమారన్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్, తారక్ ల బర్ట్ డేలకి సర్‌ప్రైజింగ్ టీజర్స్ వదిలి ఆశ్చర్యపరిచాడు. మరి, ఈ ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తాడో.. అని అటు ఘట్టమనేని అభిమానులు, సినీ లవర్స్ తో పాటు..సినీ ప్రముఖులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

#Tollywood#ssrajamouli#varanasi#maheashbabu#priyankachopra
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి