సోషల్ మీడియాలో ప్రస్తుతం 80ల నాటి వింటేజ్ ఫోటోల ట్రెండ్ విపరీతంగా దూసుకుపోతోంది. నాటి సినిమా తారల శైలిని, ఆ కాలం నాటి రంగులు, వాతావరణాన్ని ప్రతిబింబించేలా తమ ఫోటోలను మార్చుకోవడానికి నెటిజన్లు విశేష ఆసక్తి చూపుతున్నారు. కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత అందుబాటులోకి వచ్చాక, కావలసిన శైలిలో ఫొటోలను రీ-క్రియేట్ చేయడం చాలా సులభంగా మారింది.
ఈ తరహా 80s రెట్రో ఫోటోలను రూపొందించడానికి ప్రధానంగా Remini, Epik, Lensa, Midjourney వంటి అనేక AI ఫొటో ఎడిటింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ముందుగా ఈ యాప్‌లను మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. యాప్‌లోని "AI Yearbook" లేదా "80s Vintage/Retro Filter" అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రాసెస్ ప్రారంభమవుతుంది.
తరువాతి దశలో మీ ముఖం స్పష్టంగా కనిపిస్తున్న కొన్ని నాణ్యమైన ఫొటోలను యాప్‌లోకి అప్‌లోడ్ చేయాలి. మీరు ఎంచుకున్న ఐఐ యాప్ మీ ముఖ కవళికలను క్షుణ్ణంగా విశ్లేషించి, 80ల కాలం నాటి క్షౌరశైలి (హెయిర్‌స్టైల్స్), కాస్ట్యూమ్స్, హెవీ గ్రైన్ ఎఫెక్ట్స్, డల్ కాలర్ టోన్స్‌ను మీ ఫొటోకు జత చేస్తుంది. కొద్ది సెకన్లలోనే నాటి రెట్రో లుక్ సిద్ధమవుతుంది.
ఇలా తయారైన ఫొటోలను హెచ్‌డీ క్వాలిటీలో గ్యాలరీలోకి సేవ్ చేసుకుని, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లతో పంచుకోవచ్చు. ఎలాంటి టెక్నికల్ పరిజ్ఞానం లేకపోయినా, ఈ ఐఐ యాప్‌ల సాయంతో సాధారణ ఫొటోలను కూడా అతి తక్కువ సమయంలో ఆకట్టుకునే 80s వింటేజ్ మాస్టర్‌పీస్‌లుగా మార్చేయవచ్చు. ఇలా స్టెప్ బై స్టెప్ కింద ఇచ్చిన విధంగా చేస్తే మీరు కోరుకున్న విధంగా 80’s లోకి మీరూ వెళ్లొచ్చు.

AI ఫొటో ఎడిటింగ్ యాప్ ఓపెన్ చేయడం – Remini / Epik వంటి యాప్‌లోకి వెళ్లడం
AI Yearbook / 80s Retro Filter ఎంపిక – సంబంధిత ఆప్షన్‌ను సెలెక్ట్ చేయడం
ఫొటో అప్‌లోడ్ – ముఖం స్పష్టంగా ఉన్న ఫొటోను ఎంచుకోవడం
AI Processing – 80s హెయిర్‌స్టైల్, కాస్ట్యూమ్, గ్రెయిన్, రెట్రో కలర్ టోన్ జోడించడం
Before → After – సాధారణ ఫొటో 80s Vintage లుక్‌గా మారిన విధానం
HD Save & Social Media Share – ఫొటోను సేవ్ చేసి Instagram/Facebookలో షేర్ చేయడం










