తెలంగాణ

ప్రజా నాయకుడు.. మంత్రి తుమ్మలపై బీజేపీ ఎమ్మెల్యే ప్రశంసల వర్షం

రచన: NK6 నిమిషాల పఠనం

ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం నాయకులే. నేతలు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న విమర్శలు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడమే కాదు బూతులు కూడా తిట్టుకుంటున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీంతో రాజకీయాలన్నా, నాయకులన్నా అసహ్యించుకునే పరిస్థితి ప్రజల్లో ఉంది.

Tummala Nageswara Rao: ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం నాయకులే. నేతలు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న విమర్శలు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడమే కాదు బూతులు కూడా తిట్టుకుంటున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీంతో రాజకీయాలన్నా, నాయకులన్నా అసహ్యించుకునే పరిస్థితి ప్రజల్లో ఉంది.

అసెంబ్లీలో అరుదైన ఘటన

లీడర్లు ప్రత్యర్థి పార్టీ నాయకులను దారుణంగా తిట్టడం కామన్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇందుకు పూర్తి భిన్నమైన ఘటన ఒకటి జరిగింది. ఒక పార్టీకి చెందిన నాయకుడు మరో పార్టీకి చెందిన నేతపై ప్రశంసల వర్షం కురిపించారు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ కితాబిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అరుదైన ఘటన జరిగింది.

ప్రజా నాయకుడు అంటూ ప్రశంసలు

బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై అసెంబ్లీలో ప్రశంసల వర్షం కురిపించారు. తుమ్మల చాలా గ్రేట్ లీడర్.. నాయకుడు అంటే అలా ఉండాలి అని పొగిడారు. తుమ్మల ప్రజా నాయకుడు అని మెచ్చుకున్నారు. అసెంబ్లీలో మాట్లాడిన రాకేశ్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

మంత్రి అంటే ఇలా ఉండాలి

తాను ఒక రోజు రైతుల సమస్యపై మంత్రి తుమ్మలకు ఫోన్ చేస్తే ఆయన వెంటనే స్పందించారని రాకేశ్ రెడ్డి తెలిపారు. ఆ రోజు ఆదివారం.. అయినా మంత్రి స్పందించి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారని రాకేశ్ రెడ్డి చెప్పారు. మంత్రులు ఎలా ఉండాలి అని చెప్పడానికే తాను ఈ అంశాన్ని సభలో ప్రస్తావించానని ఆయన వెల్లడించారు.

ఇంతవరకు ఏ మంత్రి నుంచి కూడా స్పందన సరిగా రాలేదని.. కానీ తుమ్మల నుంచి వచ్చిందని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. తుమ్మల నాగేశ్వర రావు 40ఏళ్లు మంత్రిగా పని చేశారు, అలాంటి నాయకుడు.. తన లాంటి కొత్త ఎమ్మెల్యేకి గౌరవం ఇవ్వడం, ఫోన్ చేసి మాట్లాడటం, సమస్యను పరిష్కరించడం నిజంగా గ్రేట్ అని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ప్రశంసించారు.

కొత్త ఎమ్మెల్యేనైనా నాకు గౌరవం ఇచ్చారు

''ఒకరోజు 500 మంది రైతులు ధర్నా చేస్తామని నా ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నారు. వెంటనే మంత్రి తుమ్మలకు ఫోన్ చేసి సమస్య గురించి చెప్పాను. ఆయన సమస్య అంతా విన్నారు. మళ్లీ ఆయనే నాకు ఫోన్ చేసి.. మూడు గంటల్లో సమస్య పరిష్కారం అవుతుందని నాతో చెప్పారు. మరోసారి ఒంటిగంటకు ఆయన నాకు ఫోన్ చేశారు. నేను కలెక్టర్ తో మాట్లాడాను మీ సమస్య పరిష్కారం అయిపోతుందని చెప్పారు. ఆరోజు ఆదివారం. అయినా ఆయన స్పందించారు. ఇంత బాధ్యతగా ఉన్న మంత్రిని, ఒక కొత్త ఎమ్మెల్యేకి ఇంత గౌరవం ఇచ్చిన మంత్రిని చూడలేదు.

మంత్రులందరూ ఇలాంటి సంస్కృతి కలిగుండాలి

అన్ని పార్టీల వాళ్లకు ఒక మంచి సందేశం వెళ్లాలనే నేనీ విషయాన్ని అసెంబ్లీ వేదికగా చెబుతున్నా. ప్రజా నాయకుడు అంటే ఇలా ఉండాలి. పార్టీలు ఏవైనా కావొచ్చు, పదవులు ఏవైనా కావొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నామా? అధికార పక్షంలో ఉన్నామా? అనేది పక్కన పెడదాం. 40ఏళ్ల నుంచి మంత్రిగా ఉన్న నాయకుడు తుమ్మల.. మా లాంటి కొత్త ఎమ్మెల్యేలకు ఫోన్ చేయడం, అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడం చాలా గొప్ప విషయం. ఇలాంటి సంస్కృతి, పద్ధతులు మిగతా మంత్రులు కూడా అలవాటు చేసుకోవాలని సభాపతి ద్వారా నేను కోరుతున్నా'' అని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్నారు.

#Tummala Nageswara Rao#Congress#Bjp#Paidi Rakesh Reddy#Telangana Assembly#Leader#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి