Vijay-Rashmika: టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ సినిమా రణబాలి. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ వచ్చి చాలామంది అనుకుంటున్న నెగిటివ్ టాక్‌కి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ సినిమాను రాహుల్ రాహుల్ సాంకృత్యన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. పీరియాడికల్ మూవీ అని ఇన్ని రోజులు అనుకున్నా, తాజా టీజర్‌లో సోషియో ఫాంటసీ కూడా మిక్స్ చేసినట్టు అర్థమవుతోంది.
టాక్సీవాలా సినిమాను ఓ ప్రయీగంలా చేశారు విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. కానీ, ఈసారి మాత్రం అతిపెద్ద ఛాలెంజ్ లా రణబాలి చిత్రాన్ని కమిటైనట్టుగా అర్థమవుతోంది. విజయ్ పవర్ ఫుల్ రోల్ సినిమా రేంజ్ ని అమాంతం పెంచినట్టుగా తెలుస్తోంది. పీరియాడికల్ సినిమా అంటే ఎంతో రీసెర్చ్ అవసరం. అందుకోసం ఏళ్లతరపడి పలు అంశాలను, అప్పటి పరిస్థితులను, పాత్రల స్వభావాన్ని తెలుసుకోవాలి.
వాటిని, సినిమాటిక్‌గా ప్రజెంట్ చేయాలి. చరిత్రను ఏమాత్రం వక్రీకరించినా కూడా ఎవరో ఒకరు గొడవ చేస్తారు. ఇలాంటి ఒత్తిడి మధ్య రణబాలి లాంటి సినిమాను తీస్తున్నారంటే మేకర్స్ కి ఖచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక, టీజర్ చూసిన తర్వాత మాత్రం వయెలెన్స్ భారీ స్థాయిలో ఉంటుందని అర్థమవుతుంది. బ్రిటీష్ దొరపై ఓ యోధుడు తిరగబడితే ఆ విజృంభణ ఎలా ఉంటుందో జస్ట్ శాంపిల్ మాత్రమే చూపించాడు.
అయితే, ఇదే పీరియాడికల్ సినిమాలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని టీజర్ చివరన హింట్ ఇచ్చాడు. గ్రామ దేవత..బలి..ఆచారాలు..వంటి అంశాలను కూడా కలిపినట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ పోస్టర్‌లో విజయ్-రష్మిక ల పెళ్ళి కి సంబందించిన పిక్ రిలీజ్ చేశారు. అది, తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో ఉన్న డివోషనల్ మూవ్‌మెంట్ కి ఎక్కడో రిలేట్ అవుతుందనిపిస్తోంది. మరి, దర్శకుడు రాహుల్ ఇందులో ఎలాంటి అంశాలను జొప్పించాడో సినిమా చూస్తే గానీ తెలియదు.












