Karthi Sardhar 2: తాజాగా థియేటర్స్‌లోకి వచ్చింది కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన సర్దార్ 2. టైటిల్ చూడగానే ఇది సీక్వెల్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సర్ధార్ చిత్రానికి రెండవ భాగంగా దర్శకుడు పీఎస్ మిత్రన్ రూపొందించాడు. ఆషిక రంగనాథ్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటించారు. అయితే, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సీక్వెల్ మూవీ ఆశించిన స్థాయిలో లేదంటున్నారు.
స్పై యాక్షన్ సినిమా అంటే మనకి హాలీవుడ్ చిత్రాల తర్వాత గుర్తొచ్చేది బాలీవుడ్ చిత్రాలే. ఈ జానర్ ని ఇష్టపడే ప్రేక్షకులు ఎక్కువగా బాలీవుడ్ మూవీస్ చూసి అలవాటు పడ్డారు. సౌత్ భాషలలో ఇలాంటి కథలతో సాహసం చేస్తే ఖచ్చితంగా కథ థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ అంచనాలకి ఏమాత్రం అందకూడదు. అప్పుడే, సినిమాపై ఆసక్తి కలుగుతుంది. కానీ, అలా కకుండా ఫక్తు కమర్షియల్ ఫార్మాట్‌లో వెళితే ఫలితం తేడా కొడుతుంది.
కార్తి సర్ధార్ 2 కూడా ఇలా జరిగిందే. దర్శకుడు పార్ట్ 1 లో చూపించిన కథ-కథనాలను పార్ట్ 2లో చూపించలేకపోయాడు. పైగా ఈసారి కథ అంతా భారతదేశాన్ని నాశనం చేయగలిగే ఆపరేషన్ డాకు మీదే తిరుగుతుంది. దీనికి, కార్తి వేసే ఎత్తుగడలు..ఆపరేషన్స్..ఇతర రా ఏజెంట్స్ ప్రమోయం ఎంతవరకూ పనిచేసింది..ఇలాంటి అంశాలతో నెట్టుకొచ్చాడు. ఇక్కడే, ఆసక్తి తగ్గిపోతుంది. ఓ రొటీన్ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది.
సినిమా మొత్తంలో కార్తి డ్యూయల్ రోల్ పర్ఫార్మెన్స్, కొన్ని మెప్పించే సన్నివేశాలు..అంతే ఊహించుకోవాలి. సాధారణంగా పార్ట్ 1 చూసిన ప్రతీ ప్రేక్షకుడికి పార్ట్ 2 మీద ఆసక్తి రెట్టింపు స్థాయిలో పెరగడం సహజం. కానీ, పార్ట్ 1 లో ఉన్న మేయిన్ ఎలిమెంట్స్ పార్ట్ 2 లో మిస్ అయ్యాయి. ఇది క్లియర్‌గా ఆడియన్ కి అర్థమవుతుంది. పట్టు లేని కథనాన్ని రాసుకున్నాడు మిత్రన్.
కొన్ని ఐడియాలు ఆసక్తిగా ఉన్నప్పటికీ స్క్రీన్ మీద వాటిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. హీరోయిన్స్ ఆషిక..మాళవిక..విలన్ ఎస్.జె.సూర్య బాగానే పర్ఫార్మ్ చేశారు. కానీ, చేయడానికే అక్కడ ఏమీలేదని అర్థం అవుతుంది. మొత్తానికి భారీ అంచనాలతో వచ్చిన కార్తి సర్ధార్ 2 మాత్రం నిరాశపరిచినట్టే.












