సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.గురువారం ముఖ్యమంత్రి తమ్ముడు కొండల్ రెడ్డి కంపెనీ ‘టెసెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్’కు ఫోర్త్ సిటీలో అక్రమంగా కట్టబెట్టిన భూమి వద్దకు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు చేరుకొని పరిశీలించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. అమెరికా పర్యటనలో సొంత సోదరులతోనే రేవంత్ రెడ్డి ఒప్పందాలు చేసుకొని పెట్టుబడులు తెస్తున్నాడని ఎద్దేవాచేశారు.
‘ది గ్రేట్ అనుముల రేవంత్ రెడ్డితో ది గ్రేట్ పారిశ్రామికవేత్త అనుముల జగదీశ్వర్ రెడ్డితో రూ.1000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఇలా అనుముల జగదీశ్వర్ రెడ్డికి రూ.1000 కోట్లు, అనుముల కొండల్ రెడ్డికి రూ.250 కోట్లు ఇవ్వడమేనా ప్రజాపాలన.అనుముల అన్నదమ్ముల దోపిడీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని బీజేపీ వాళ్ళు అంటారు.. మరి దొంగని పట్టుకోవాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్కడ ఉన్నాడు.
https://x.com/TeluguScribe/status/2097943610851578189?s=20
ఇజ్రాయెల్‌తో ఒప్పందం చేసుకుంటే రాహుల్ గాంధీ మోడీని ప్రశ్నించాడు. అదే రేవంత్ రెడ్డి ఇజ్రాయెల్‌తో ఒప్పందం చేసుకుంటే నువ్వు ఎందుకు ప్రశ్నించడం లేదు. ఎందుకు ఈడీ విచారణకు, సీబీఐ విచారణకు ఆదేశించడం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి పొంగులేటి కూడా రాఘవ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అని స్టార్ట్ చేశాడు. శాసనసభలో ఇది అడుగుతామనే మమ్మల్ని సస్పెండ్ చేశారు’ అని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
https://x.com/TeluguScribe/status/2097926236039450660?s=20
‘ఫ్యూచర్ సిటీ అనేది మాయ.. రేపటి రోజున నిలవదు, చెల్లదు. గతంలో ఫార్మా సిటీ పేరు మీద షరతులతో భూసేకరణ జరిగింది. ఆ భూముల్లో వేరే సిటీలు పెడితే అవి రద్దు అవుతాయి. ఫ్యూచర్ సిటీ అనేది భవిష్యత్తులో ఉండదు. ఫ్యూచరే లేని సీఎం తన అన్నదమ్ముల కోసం ఆడుతున్న నాటకంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారు బలిపశువులు కాకండి. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారు ఇక్కడ జరుగుతున్న రియల్ ఎస్టేట్ మాఫియాలో ఇరుక్కుంటే, మేము ప్రభుత్వంలోకి వచ్చాక మొట్టమొదట నష్టపోయేది మీరే. రంగారెడ్డి జిల్లాలో ఊరూరా సదస్సులు పెట్టి ఫ్యూచర్ సిటీ మాయ గురించి చెప్తాం’ అని కేటీఆర సంచలన కామెంట్స్ చేశారు. కాగా, దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.












