తెలంగాణ

TG : రేషన్ దందా.. సిరిసిల్లలో 250 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో అక్రమంగా నిల్వచేసిన పీడీఎస్ బియ్యం భారీగా పట్టుబడింది. కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఈ బియ్యాన్ని ప్రభుత్వానికి తెలియకుండా తరలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రూ.వేల కోట్ల పీడీఎస్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లు యజమానులు అమ్ముకున్నట్టు తెలిసింది.

రాష్ట్రంలో అక్రమంగా నిల్వచేసిన పీడీఎస్ బియ్యం భారీగా పట్టుబడింది. కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఈ బియ్యాన్ని ప్రభుత్వానికి తెలియకుండా తరలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రూ.వేల కోట్ల పీడీఎస్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లు యజమానులు అమ్ముకున్నట్టు తెలిసింది. మిల్లింగ్ కోసం తీసుకుని ప్రభుత్వానికి తిరిగి అప్పగించకుండా బియ్యం అమ్ముకున్న మిల్లు ఓనర్లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

అందుకోసం ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దింపినట్టు తెలిసింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ కేంద్రంగా టన్నుల కొద్దీ పీడీఎస్ రైస్ కర్ణాటకకు దారి మళ్లిందని అధికారులు గుర్తించారు.రవాణాశాఖలో కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి లారీల్లో వెళ్తున్న బియ్యం లోడ్‌ను అడ్డుకోవడం లేదని సమాచారం.

https://x.com/pulsenewsbreak/status/2097875370813046976?s=20

తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీగా రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.అక్రమంగా నిల్వ చేసిన 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కనకదుర్గ ట్రేడర్స్ రైస్ మిల్లుపై సివిల్ సప్లైస్ అధికారులు ఇవాళ ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించినట్టు తెలిసింది.

నిబంధనలకు విరుద్ధంగా బియ్యం నిల్వ చేసినందుకు కనకదుర్గ ట్రేడర్స్ లైసెన్స్ సీజ్ చేసినట్టు సమాచారం.పట్టుబడిన రేషన్ బియ్యాన్ని సేఫ్ కస్టడీ కోసం వాసవి ట్రేడర్స్‌కు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్ఓ బుచ్చిబాబు హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి మిల్లింగ్ కోసం తీసుకున్న బియ్యాన్ని అక్రమంగా తరలించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

#PDS rice#stored#illegal#sircilla#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి