సినిమా

The Paradise: జడల్ జమానా షురూ..నార్త్ అమెరికా మోత మోగుతోంది..

రచన: Anshu4 నిమిషాల పఠనం

The Paradise: నాని నటించిన 'ది ప్యారడైజ్' సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో జోరు చూపిస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే టికెట్స్ ప్రీ సేల్స్ లో జడల్ జమనా షురూ అయింది. ఏకంగా 5000 వేలకి పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమా 7 భాషలలో సెప్టెంబర్ 24న రిలీజ్ కానుండగా, 23న ప్రీమియర్స్ పడబోతున్నాయి.

నాని నుంచి ఈ మధ్య కాలంలో కాస్త వైల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. వి సినిమా నుంచి నాని కూడా రూట్ మార్చాడు. యాక్షన్ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నాడు. వి, టక్ జగదీష్, సరిపోదా శనివారం, హిట్ 3 లాంటి సినిమాలలో వయెలెన్స్ బాగా ఉంది. ముఖ్యంగా, హిట్ సినిమాలో అంత వైల్డ్ ఆనిమల్ గా నాని కనిపిస్తాడని ఎవరూ ఊహించలేదు. సినిమా ఆశించిన విజయం అందుకోకపోయినప్పటికీ నాని పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది.

ఇక, దసరా లాంటి కల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలో కూడా డిఫరెంట్ మేకోవర్‌తో అకట్టుకున్నాడు. క్లాస్, మాస్, యాక్షన్..జానర్ ఏదైనా నాని నటనలో మాత్రం తనని ఎవరూ మ్యాచ్ చేయలేరని పరఫార్మెన్స్‌తో నిరూపిస్తున్నాడు. ఇక, ఇప్పుడు ఏకంగా భారీ పాన్ ఇండియా సినిమా 'ది ప్యారడైజ్' సినిమాతో రాబోతున్నాడు. హైదరాబాద్..సికింద్రాబాద్ ప్రాంతంలో ఒకప్పుడు అణగారితనానికి గురైన ఓ వర్గానికి చెదిన నాయకుడి కథతో రూపొందించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.

ఇటీవల 'ది ప్యారడైజ్' సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం భారీ అంచనాలను పెంచాయి. ఈ క్రేజ్ వల్లే యూఎస్ లో ప్రీ సెల్స్ లో దుమ్ము దుపులుతోంది. 5000 కి పైగా టిక్సెట్స్ సేల్ అయ్యాయి. అంటే ఒక లక్ష 50 వేల డాలర్స్ మార్క్ ని చేరుకుంది అప్పుడే. ఇదే, ఊపు కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ప్యారడైజ్ సినిమా సరికొత్త రికార్డ్స్‌ను అన్నీ చోట్ల నమోదు చేయడం ఖాయం. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా కయాదు లోహర్ నటించింది.

#The Paradise#Nani#Kayadu Lohar#Srikanth Odela#Keerthy Suresh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి