సినిమా

'418'-Censor Report: ఈ హారర్ థ్రిల్లర్ పెద్దలకి మాత్రమే!

రచన: Anshu4 నిమిషాల పఠనం

'418'-Censor Report: కీర్తన్ నందగౌడ దర్శకత్వంలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతీ పగడాల ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సినిమా 418. తాజాగా ఈ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ ఎ సర్టిఫికెట్‌ను జారి చేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అందిస్తున్నాడు. ఇక, ఈ సినిమాను సెప్టెంబర్ 18న రిలీజ్ చేయబోతున్నారు.

ఈ మధ్య కాలంలో యువ దర్శకులు కొందరు ఎక్కువగా సస్పెన్స్ అండ్ హర్రర్ కామెడీ, హర్రర్ థ్రిల్లర్స్ మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే, ఈ జానర్ సినిమాలకి ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరణ దక్కుతోంది. ఫక్తు కమర్షియల్ సినిమా అంటే రొటీన్ కామెడీ, రెండు ఫైట్లు 4 పాటలు అన్నట్టుగా అయిపోయింది. దీనివల్ల, కొన్ని సినిమాలను చూసేందుకు జనాలు నిరాకరిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఆడియన్స్‌ను థియేటర్స్ వరకూ రప్పిచాలంటే హర్రర్ సినిమాలే కొంతవరకూ అండగా నిలుస్తున్నాయి. బిగ్ స్క్రీన్ మీద హర్రర్ సినిమాలను చూసే ఎక్స్పీరియన్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. ఈ జానర్ సినిమాలకి ఎప్పుడూ ఆదరణ దక్కుతుంది. అందుకే, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిర్మాణంలో 418 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా తోడైంది.

ఇంతటి, క్రేజీ కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా అయినప్పటికీ కొన్ని విషయాలలో సెన్సార్ అభ్యంతరాలు తెలిపింది. మరి, ఇందులో ఎలాంటి భయానిక కంటెంట్ ఉందో గానీ 418 కి సెన్సార్ మాత్రం చాలా సయమం పట్టింది. ఇన్నాళ్ళు, ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించకపోవడానికి సెన్సార్ అవకపోవడమే. ఫైనల్ గా ఆ పనులు కూడా పూర్తయ్యాయి గనక సెప్టెంబర్ 18న రిలీజ్ అని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు.

#418 movie#prashanth neel#mythri Movie Makers#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి