స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Telangana: కొంగర ఖుర్ద్‌లో భూ బీభత్సం ఎవరిది?

రచన: Venu•••15 నిమిషాల పఠనం

తెలంగాణ భూ చట్టాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కోర్టులు కేసును బట్టి తీర్పులు ఇస్తున్నాయి. కోర్టుకు సమర్పించే పేపర్స్ ఒరిజినలా, ఫేకా గుర్తు పట్టలేని పరిస్థితులు ఉన్నాయి.

* ఏఐ యుగంలో రూ.వేల కోట్లు విలువగల వందల ఎకరాల భూములు కబ్జా అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం

* ఎన్నో భూ స్క్రూటినీలు, అనుమతుల అథారిటీలు ఉన్నా గజాలకైనా టైటిల్ గ్యారెంటీ ఇవ్వలేరా?

* ఆనాడు మిగిలిపోయిన భూములు క్లియర్ చేస్తున్నారా?

* నాయకులకు లాభాలు.. రోజుకో వార్తతో రియల్టర్స్‌కు నష్టాలు?

* ప్లాట్ కొనుగోలుదారులకు నిత్యం టెన్షన్స్?

- అసెంబ్లీ సాక్షిగా భూ టైటిల్స్‌పై ఎన్నో నీతులు చెప్పిన సీఎం

- మహా నగరంలో ప్లాట్ కొనాలంటే భయపడుతున్న జనం

- ఏ లిటిగేషన్‌తో ఎవరు ఎప్పుడు వస్తారోనని ఆందోళన

- కొంగర ఖుర్ద్‌లో వందల ఎకరాలంటున్న భూ వివాదమే ఉదాహరణ?

- మూడేళ్ల క్రితమే కళ్లు తెరిస్తే ఇప్పుడు ఈ ఆందోళన ఉండకపోవచ్చు

- ఇప్పుడు వార్తలతో ఏం జరుగుతుందో, కేసులు ఏంటో పిన్ టూ పిన్ ఏం జరిగిందో స్వేచ్ఛ న్యూస్ సవివరణ స్టోరీ

- ఫైట్ చేయాల్సింది సిస్టమ్‌పై.. అందుకే పాలకుల భూ ఫైటింగ్ పార్ట్-3

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్

పొజిషన్‌లో ఉంటే సరిపోవడం లేదు?

తెలంగాణ భూ చట్టాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కోర్టులు కేసును బట్టి తీర్పులు ఇస్తున్నాయి. కోర్టుకు సమర్పించే పేపర్స్ ఒరిజినలా, ఫేకా గుర్తు పట్టలేని పరిస్థితులు ఉన్నాయి. వాటికి తోడుగా సుప్రీంకోర్టు, హైకోర్టు ఫుల్ బెంచ్‌లు కామన్ ఆర్డర్స్‌తో టైటిల్ లేకుంటే ఏనాటికైనా టైటిల్ దారుడుకే చెందుతుందని కొన్ని కేసుల్లో తీర్పులు ఇవ్వడంతో భూ వివాదాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి.

వీటికి తోడుగా ఇనాం చట్టాలు, పీటీ దారుల హక్కులు, అర్బన్ సిలింగ్ యాక్ట్ ఎత్తివేయడంతో 70 ఏండ్ల క్రితం నాటి టైటిల్ దారులు పుట్టుకొస్తున్నారు. దశాబ్దాల నుంచి పొజిషన్‌లో ఉన్నా కూడా, ఆ ఆస్తి నీది కాదని నోటీస్ ఇస్తే చాలు ఆ క్షణం నుంచి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ అండదండలు ఉంటే ఎలాంటి స్టాండెండ్ ఆపరేటివ్ ప్రొసీడింగ్స్ ఫాలో కాకుండానే కబ్జాలు చేసుకుంటూ భయాందోళనకు గురి చేస్తున్నారు.

ఈ భూ భయానకం పోవాలంటే అనుమతులతో పాటు టైటిల్ గ్యారెంటీ ఎంతో అవసరం. ఈ టెక్నాలజి కాలంలో వేల కోట్ల రూపాయల భూమి వందల ఎకరాలు కబ్జా అని చెప్పడానికి సిగ్గుగా అనిపిస్తోంది. అందుకు 10 ఏండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సొంత పత్రిక ఇప్పుడు ఇలా రాయడంపై అనేక అనుమానాలు. ఆనాడు రేవంత్ రెడ్డి ఎన్నో ముచ్చట్లు చెప్పినా, ఇప్పుడు మళ్లీ అదే భూ దందా నడిపించి వేల కోట్ల భూములను కొల్లగొట్టడం చూస్తుంటే పాలకులపై భూ ఫైటింగ్, టైటిల్ గ్యారెంట్ తెచ్చుకోవడం ఎంతైనా అవసరం ఉంది.

కొంగర ఖుర్ద్‌లో జరిగింది ఇదే?

- సీసీఎస్ కేసులో ఆనాటి ఆర్డీవో ఎందుకు సమాధానం ఇవ్వలేదు

- 3 ఏండ్ల క్రితమే మేలుకుంటే ఈనాడు ఈ పరిస్థితి ఉండేదా?

- ఇప్పుడు వార్తలతో ఒరిగేది ఏంటి?

- టైటిల్‌కు భరోసా ఇచ్చేది ఎవరు?

కొంగర ఖుర్ద్(ఏ) గ్రామంలో రూ.2,000 కోట్ల విలువైన భారీ భూ కుంభకోణం జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. 400 ఎకరాల వక్ఫ్ భూమిని భూమాఫియా ఆక్రమించేందుకు ప్రయత్నం అని ప్రధాన మీడియా తాజాగా వార్తలు రాస్తోంది. అయితే, మొత్తం భూమి వక్ఫ్ భూమిగా చిత్రీకరిస్తున్నారు. అది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది మరిచిపోతున్నారు. రెవెన్యూ తప్పిదాలు జరిగాయి. వివిధ సర్వే నెంబర్లలో అనేక హక్కుదారులు పుట్టుకొచ్చారు.

దీంతో ఆ భూమి అంతా దొంగ భూమిగా పిలవడం అలవాటుగా మారింది. కోర్టులలో అనేక విచారణలు జరిగాయి. అప్పుడు ఆధారాలు తేల్చుకోలేకపోయారు. దీంతో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున వార్తలతో ఆరోపణలు చేయడం టైటిల్‌కి , కొనుగోలుదారులకు భయాందోళనను కల్గిస్తోంది. సర్వే నెంబర్లు 80 నుండి 90, 310 నుండి 326 వరకు న్యాయస్థానాలలో టైటల్ సాధించుకోలేక పోయారు.

కోర్టులను మేనేజ్ అయ్యాయని మాట్లాడటం ఈజీ కాని వాళ్లు సమర్పించినవి ఫేక్ అని కోర్టులో రుజువు చేయలేకపోవడం, 20 ఏండ్ల క్రితమే పట్టా, పాస్ బుక్‌లు ఇవ్వడంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా మీడియాతో కొనుగోలుదారులను టెన్షన్ పెట్టించడమే అవుతుంది. సర్వే నెంబర్ 80 నుంచి 90లలో హక్కుదారులు 3 సివిల్ దావాలు వేశారు. ఎన్నో రిట్ పిటిషన్స్ దాఖలు చేశారు. కానీ, ఆయా న్యాయస్థానాల్లో వాళ్లకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి.

రెవెన్యూ పత్రాలు ఫోర్జరీ అయ్యాయని హైదరాబాద్ సీసీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ అయింది. ఒక మాజీ ఆర్‌డీఓ తన సంతకం కాదని లెటర్ రాశారు. కానీ, అదే సీసీఎస్‌లో కేసులో ఎందుకు నిరూపించలేకపోయరనే దానికి సమాధానం లేదు. 5 నోటీసులు ఇచ్చినా ఎక్కడ మోసం జరిగింది. పోర్జరీ ఏంటో తేల్చలేకపోయారు. దీంతో సీసీఎస్‌లో కేసును క్లోజ్ చేశారు. ఈ కేసు క్లోజ్ చేస్తే ఎందుకు లీగల్‌గా ఇన్నాళ్లు ఫైట్ చేయలేకపోయారు అనేది పెద్ద ప్రశ్న. అనేక తీర్పులు వచ్చిన తర్వాత ఎటూ పాలుపోని పరిస్థితిలో రంగంలోకి దిగారు. స్వేచ్ఛ న్యూస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల 3 ఏండ్ల క్రితమే వార్త రాసినప్పటి నుంచే క్రమం తప్పకుండా ఫైట్ చేస్తే ఈనాడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.

ఏది వక్ఫ్ భూమి?

వక్ఫ్ భూములను ఆక్రమిస్తుంటే క్లెయిమ్‌ ఉండాలి. వాళ్లను మేనేజ్ చేసినా, అడ్వకేట్లను హత్యలు చేసినా ఇప్పటికి భూములు వక్ఫ్ చేతిలోనే ఉండాలి. కానీ, దానికి బదులుగా కొంతమంది రైతుల రూపంలో ఉన్న వారి చేతిలో ఉన్నాయి. వాళ్లకు టైటిల్ కాని వాళ్లు సమర్పించిన పత్రాలు కూడా ఫేక్‌గా ఉన్నాయని అధికారులు గుర్తించారు. న్యాయస్థానాల్లో నిరూపించకోకపోవడం వాళ్ల నిర్లక్ష్యమే కారణం. వక్ఫ్ గెజెట్‌ను హైకోర్టు పక్కన పెట్టిన తర్వాత అనుమతులు పొందిన భూములు ఉన్నాయి.

ఇలాంటి పూర్తి వాస్తవాలను నిర్ధారించకుండానే మెయిన్ స్ట్రీం మీడియా వార్తలు రాసింది. దీంతో ఏది నిజం? అదే పొజిషన్ దారులు అమ్మితే నిజమైన టైటిల్ వస్తుందా? అది ఎంత వరకు కొనుగోలు భరోసా ఇస్తారు అనేది అనుమానంగా ఉంది. అందుకే కనీసం ప్లాట్ ఓనర్స్‌కి టైటిల్ గ్యారెంటీ ప్రభుత్వమే ఇవ్వాలి. అది రేవంత్ రెడ్డి వలనే అవుతుందని తెలంగాణ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కన్ఫూజన్‌లో అధికారులు?

భూమి టైటిల్ ఏంటో కోర్టులు నిర్ణయించాలి. కోర్టులే మేనేజ్ అవుతున్నాయనే ఆరోపణలతో అధికారులు వాళ్ల చేతి వాటానికి ఎక్కువగా పని చెబుతున్నారు. దీంతో కన్ఫ్యూజ్ చేసేసి డబ్బులు తీసుకొని ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అది మళ్లీ టైటిల్‌కి మాకు సంబందం లేదని చెప్పడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. తగిన ఆధారాలు లేకుండా దానిని భూ మాఫియా కార్యకలాపాలకు కుమ్మక్కు అయ్యారని మీడియా చెప్పడంతో వీరు దండుకోవడం ఎక్కువగా మారింది.

అనుమతులు ఎలా వచ్చాయి.. పొంతనలేని ప్రశ్నలతో పరేషాన్?

ఏదైనా భూమిపై టైటిల్ రావాలంటే కొన్ని దశాబ్దాలుగా వాటిపై ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అంత ఈజీగా ఏదీ కాదు. వచ్చినా నిలబడదు. కొంగర్ ఖుర్ద్‌లో 1989 నాటి ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఫైల్ లేదని చెబుతున్నారు. కానీ, అదే ఆర్టీఐలో పొందిన పత్రాలు అధికారులకు సమర్పించారు. కోర్టుల్లో రికార్డ్ అయి ఉన్నాయి. దీంతో వార్తలు రాసినంత మాత్రన రుజువు కాలేవు.

కానీ, 2023 నుంచే ఈ ఆలోచన ఉంటే 2025లో వచ్చిన హైకోర్టు తీర్పులకు అడ్డుగా ఫైట్ చేసే వాళ్లు. హెచ్ఎండీఏ అనుమతులు, లేఅవుట్ పర్మిషన్స్‌కి పక్కాగా 3 ఏండ్లు పని చేసుకుని ఎవరు అనుమానించాల్సిన అవసరం లేనంతగా ఆధారాలు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏన్ని వార్తలు రాస్తే ఏముంది? కొనుగోలుదారులకు టెన్షన్ తప్ప. 400 ఎకరాలు అని ఒకే పదంతో అంతా ఏకం చేయడం వలన కొన్ని సర్వే నెంబర్స్‌లో ఇంకా ఫైట్ చేసే అధికారం ఉన్నా అది కొల్పోయే పరిస్థితి కల్పించేలా వార్తలు ఉండటం భూ మాఫియాకు సపోర్టు చేసినట్లే ఉంటుంది.

అమ్మకపుదారుల ఫైనాన్స్ పరిస్థితి ఏంటో రాసినప్పుడు వాళ్లకు పట్టా పాసుబుక్‌లు ఎప్పుడు ఇచ్చారనేది కూడా కీలకం. 20 ఏండ్ల క్రితం ఇచ్చిన పాస్ బుక్‌లు ఫేక్ అని నిరూపిస్తే, వాళ్ల ఫైనాన్స్ గురించి మాట్లాడొచ్చు. 80 ఎకరాలు అమ్మినప్పుడు కాపిటల్ గెయిన్, జీఎస్టీలు ఎన్నో రకాలుగా లూప్స్ ఉంటాయి. వాటన్నింటిని పట్టుకుని ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తే ఫైట్ చేయాల్సిన అవసరం మీడియాకు ఉంది. వీఎంస్ విస్తర్ణాన్ని మార్చినట్లు ఆధారాలు నిరూపించాల్సిన అవసరం ఉంది. 400 ఎకరాలు అని రూ.3 వేల కోట్లను చెబుతున్నా అక్కడ 60 ఎకరాలకు మించి పనులు జరగడం లేదు. ఇలా సంఖ్య వ్యత్యాసం ఉండటంతో అధికారులకు చులకనగా కనిపించే అవకాశాలు ఉన్నాయి.

పొజిషన్ దారులకు తెలియకుండానే మార్పులు చేర్పులు జరిగాయా?

కొంగర ఖుర్డ్(ఏ), కొంగర ఖుర్ద్(బీ), ఇనాంలో సర్వే నెంబర్స్ చాలా తేడాలు ఉన్నాయి. నిజమైన సాగుదారులు, భూమి యజమాని భూమి కోల్పోయినట్లు అయితే లీగల్‌గా ఫైటింగ్ చేయవచ్చు. మూడేళ్ల క్రితం ఎఫ్‌ఐఆర్‌లు కూడా పెట్టారు. అయితే, ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఉండటంతో ఏ చట్ట ప్రకారం తప్పు అని చెప్పేలా లేకుండా పోయింది. అలా పటిష్టంగా తయారు చేసుకోవడంతో పోజిషన్ దారులు నిరూపించుకోవాల్సిన అవసరం వస్తోంది.

మూడేళ్ల క్రితం బౌన్సర్స్‌ని పెట్టి కబ్జా చేస్తే ఆనాడు వార్తలతో రైతులు తరిమికొట్టారు. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా చేసుకున్నారు. అయితే వ్యక్తులు మారడంతో పోరాటం కూడా మారాల్సిన అవసరం ఉంది. అది పొజిషన్ దారులు చేయలేకపోతున్నారు. సర్వే నెంబర్లు 68, 69, 71, 72కి సంబంధించిన 1989 ప్రొసీడింగ్స్ నకిలీవి లేదా బ్యాక్‌ డేటెడ్ అని ఆరోపణలు ఉన్నాయి. 11.04.1989 నాటి ప్రొసీడింగ్స్ నెం. జే/4498/1988 ద్వారా సమర్థవంతమైన ఆర్‌డీఓ జారీ చేసిన చట్టబద్ధమైన ఆక్యుపెన్సీ రైట్స్ (మక్తా/ఇనాం) ప్రొసీడింగ్స్‌కు ఇచ్చారు.

ఆ తర్వాత 21.07.1994 నాటి ప్రొసీడింగ్స్ నెం. బీ/3727/1993 ద్వారా రెవెన్యూ రికార్డులలో అమలు చేయబడ్డాయి. ఆ తర్వాత వారసత్వంగా రెవెన్యూతో పాటు ల్యాండ్ కన్వర్షన్ కూడా 2012 కాలంలోనే మార్చుకున్నారు. సర్వే నెంబర్లు 193, 194, 195 లలో, నకిలీ పత్రాలు, ఫెన్సింగ్ వేశారని అంటున్నారు. దీనిపై స్టే ఉందని చెబుతున్నారు. ఆ స్టే ఎందుకు అమలు కావడం లేదు? అసలు ఆ కోర్టు ఉత్తర్వుకు కట్టుబడి ఉన్నారా లేదా అనేది కూడా చూసుకొని వార్తలను రాయాల్సిన అవసరం ఉంది..

#Telangana#Massive Land Grab#Kongara Khurd#Maheshwara#BRS#Congress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి