తెలంగాణ

Telangana SIR: ఓటర్లకు లాస్ట్ ఛాన్స్.. ఎస్‌ఐఆర్ అభ్యంతరాల గడువు రేపటితో క్లోజ్!

రచన: Mahesh••2 నిమిషాల పఠనం

Telangana SIR: తెలంగాణలో ఓటర్ల లిస్ట్ సవరణ గడువు రేపటితో (అక్టోబర్ 7) క్లోజ్ కానుంది. ఓట్ల గల్లంతుపై అభ్యంతరాలు చెప్పాలన్నా, కొత్తగా ఓటు కోసం అప్లై చేసుకోవాలన్నా బుధవారమే లాస్ట్ డేట్. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే తర్వాత ఏకంగా 73.39 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో ఇప్పటిదాకా 7,56,180 మంది అభ్యంతరాలు, క్లెయిమ్‌లను ఎన్నికల సంఘానికి సమర్పించారు.

ఇందులో కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచే 4.64 లక్షలకు పైగా అఫికేషన్స్ వచ్చాయి. కొత్త ఓట్ల నమోదు కోసం 4.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు అధికారులు కేవలం 41,776 అఫికేషన్స్‌ను మాత్రమే తేల్చగా, ఇంకా 7.14 లక్షల ఫైళ్లు పరిశీలనలోనే ఉన్నాయి. నవంబర్ 5లోగా వీటిని పూర్తి చేయాల్సి ఉంది. విచారణలు ముగించి నవంబర్ 9న కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల లిస్ట్‌ను రిలీజ్ చేయనుంది. ఓటు నమోదు చేసుకోని వారికి రేపే ఆఖరి అవకాశం.

#Telangana SIR#Telangana Voter List#SIR Telangana#Special Intensive Revision#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి